PM Modi Bhimavaram Visit: ప్రధానికి మోదీకి స్వాగతం పలికిన ఏపీ సీఎం జగన్, భీమవరం చేరుకున్న ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి, కాసేపట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ

ఏఎస్‌ఆర్‌ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభా వేదికకు మోదీ చేరుకుంటారు.

CM jagan and PM Modi (Photo-Twitter)

Bhimabaram, July 4: ప్రధాని మోదీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ భీమవరం చేరుకున్నారు. ఏఎస్‌ఆర్‌ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభా వేదికకు మోదీ చేరుకుంటారు. అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi) గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhushan Harichandan) , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ఘన స్వాగతం పలికారు.

భీమవరంలో జరిగే అల్లూరి సీతారామారాజు (Alluri Sitharamaraju) 125వ జయంతి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రధాని పర్యటనతో భీమవరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులతో ప్రధాని, సీఎం ప్రత్యేకంగా మాట్లాడి వారి కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని ప్రధాని సత్కరిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

భీమవరానికి ప్రధాని మోదీ, అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ చేయనున్న భారత ప్రధాని, అనంతరం పెదమీరంలో భారీ బహిరంగ సభ

అనంతరం సభా వేదిక నుంచే వర్చువల్‌ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి అర్పిస్తారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని సత్కరిస్తారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా ఆదివారం పరిశీలించారు. విమానాశ్రయాన్ని ఎస్పీజీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.