PM Modi in Bhimavaram: ప్రధాని కీలక ప్రకటన.. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, పుణ్యభూమికి రావడం నా అదృష్టం, భీమవరంలో ప్రధాని మోదీ ప్రసంగంలోని హైలెట్స్ ఇవే..
ఈ సందర్భంగా 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.
Bhimavaram, July 4: అల్లూరి సీతారామరాజు(Alluri sitaramaraju) 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి (Alluri) అని కొనియాడారు. అల్లూరి నడిచిన నేలపై మనం నడవడం అదృష్టమన్నారు. యావత్ భారతానికి అల్లూరి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ‘‘ఆంధ్రరాష్ట్రం పుణ్యభూమి... వీర భూమి. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.
రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తైందన్నారు. స్ఫూర్తి కోసమే ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మొగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని ప్రకటించారు. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగాలు చేశారని, త్యాగధనులను స్మరించుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మన్యం వీరుడిగా ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారని గుర్తుచేశారు. మనమంతా ఒకటేనన్న భావనతో ఉద్యమం జరిగిందన్నారు. ఆనాడు బ్రిటిష్‌కు వ్యతిరేకంగా యువకులు పోరాడారన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం మరింత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ప్రధానికి మోదీకి స్వాగతం పలికిన ఏపీ సీఎం జగన్, భీమవరం చేరుకున్న ప్రధాని మోదీ
స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని (PM Narendra Modi) అన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు.
వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని మోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. అల్లూరి చిన్న వయస్సులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారన్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గొప్ప ఉద్యమకారుడన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పర్యాటక శాఖా మంత్రి రోజా ప్రధాని మోడీతో సెల్ఫీ దిగారు. మోదీ వెనక్కి వెళ్లినా పిలిచి మరీ సెల్పీ దిగడం ఆసక్తికరం
Here's Video
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన (PM Modi AP Visit) ముగిసింది. బహిరంగ సభలో ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నారు.