Anam Vijay vs Kotamreddy: నెల జీతాలిచ్చి రౌడీషీటర్లను పెట్టుకొని దందాలు చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీతో కుమ్మక్కై వైసీపీని విమర్శిస్తున్నారని మండిపడని ఆనం విజయ్ కుమార్ రెడ్డి

నెల్లూరు జిల్లాలో అనవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Anam Vijay Kumar Reddy (Photo-Video Grab)

Nellore, Feb 1: నెల్లూరు రూరల్ ఎ‍మ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆనం విజయ్‌కుమార్ రెడ్డి (Anam Vijay Kumar Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . నెల్లూరు జిల్లాలో అనవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అధిష్టానం గుర్తిస్తేనే ఎవరైనా ఎమ్మెల్యే కాగలరని, కోటంరెడ్డికి పార్టీలో గుర్తింపు లేదనడం భావ్యం కాదన్నారు.పార్టీ నుంచి వెళ్లాలని కోటంరెడ్డికి (Kotamreddy Sridhar Reddy) ఎవరూ చెప్పలేదని విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

నెల జీతాలిచ్చి రౌడీషీటర్లను పెట్టుకొని దందాలు చేసిన వ్యక్తి ఆయన అని వ్యాఖ్యానించారు. హింసా రాజకీయాలు చేసి నీచ సంస్కృతికి తెరలేపారని ధ్వజమెత్తారు. కోటంరెడ్డి సోదరులు రాక్షసులుగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. కౌన్సిలర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని సీఎం జగన్ ఎమ్మెల్యేని చేశారని విజయ్‌కుమార్ రెడ్డి గుర్తు చేశారు.

ఏపీ రాజధానిగా విశాఖపట్నం, స్పష్టం చేసిన సీఎం జగన్, ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా విశాఖకు ఆహ్వానిస్తామని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే అన్నారు. టీడీపీతో కుమ్మక్కై అన్నం పెట్టిన పార్టీపై అభాండాలు మోపుతారా అని ప్రశ్నించారు.

వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బై చెప్పినట్లే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదని స్పష్టం, ఆడియో టేప్‌పై స్పందించిన సజ్జల

తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి కూడా ఏం తక్కువై పార్టీకి దూరమయ్యారో తెలియడం లేదని విజయ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ తమ కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. రామనారాయణరెడ్డి తమ్ముడిగా కాకుండా సీఎం జగన్ మనిషిగా ఉంటానని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు