ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. Global Investors Summit 2023లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి విశాఖ రాజధానిగా ఉంటుందని తెలిపారు. ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా విశాఖకు ఆహ్వానిస్తామని ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లందరికీ కృతజ్ఞతలని, పరిశ్రమలకు స్థాపనకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని ప్రకటించారు . మార్చి నెలలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సు జరగ్గా.. అందులో పాల్గొని ఇన్వెస్టర్లను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు.
Here's Video
#AndhraPradesh CM #JaganMohanReddy makes a big announcement in Delhi
I am here to invite you to #Visakhapatnam which will be our capital. I will also be shifting to #Vizag. I invite you and your colleagues to see for yourself how easy it is to do business in AP pic.twitter.com/1dJhrzALEg
— Abdulkadir/ अब्दुलकादिर (@KadirBhaiLY) January 31, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)