Nara Lokesh Speech at Mundlamuru: ఒక ఎంపీ జిప్పు విప్పి దేశం మొత్తం చూపించాడు, పాదయాత్రలో జగన్ సర్కారుపై విరుచుకుపడిన నారా లోకేష్
నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ముండ్లమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
Prakasam, July 31: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ముండ్లమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో లోకేశ్ ప్రసంగిస్తూ, భారీ జన సందోహంతో దర్శి దద్దరిల్లిందని పేర్కొన్నారు. శ్రీ గుంటి గంగా భవాని అమ్మవారి ఆలయం ఉన్న పుణ్య భూమి దర్శి... భౌద్దారామం ఉన్న నేల దర్శి అని వెల్లడించారు. స్వాతంత్య్రం రాకముందే ఎయిర్ పోర్ట్ ఉన్న ప్రాంతం దర్శి అని లోకేశ్ వివరించారు.
రాష్ట్రంలో సైకో పాలనపై మొదటి తిరుగుబాటు దర్శి నుంచే మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో దర్శి ప్రజలు టీడీపీని గెలిపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దర్శిని ఎలా అభివృద్ధి చేస్తామో అందరూ చూస్తారు. జగన్ కొత్త పథకం ప్రారంభించాడు. ఆ పథకం పేరు ఏంటో తెలుసా 'సైకో స్విమ్మింగ్ పూల్స్'. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నా అని బిల్డప్ ఇచ్చాడు జగన్. కానీ కట్టింది ఏంటో తెలుసా? స్విమ్మింగ్ పూల్స్. సెంటు స్థలాల పేరుతో రూ.7 వేల కోట్ల స్కాంకి పాల్పడ్డాడు జగన్. ఉండటానికి పనికిరాని స్థలాలు పేదలకి ఇచ్చాడు. ఆ స్థలాల లెవెలింగ్ పేరుతో మరో రూ.2,200 కోట్లు కొట్టేశాడు.
చిన్న వర్షం వస్తేనే ఆ స్థలాలు స్విమ్మింగ్ పూల్స్ లా తయారు అవుతున్నాయి. మొన్న వారం రోజులు వరుసగా వర్షాలు పడ్డాయి. అప్పుడు ప్యాలస్ బ్రోకర్ సజ్జల పరిగెత్తుకుంటూ జగన్ దగ్గరకు వెళ్లాడు. సార్ సెంటు స్థలాలు అన్ని మునిగిపోయాయి... పునాదులు కూడా కనపడటం లేదు... జనం గోల పెడుతున్నారు అన్నాడట. అప్పుడు జగన్ ప్యాలస్ బ్రోకర్ ని రెండు పీకాడు. ఈత కొట్టుకుంటూ వెళ్లు పునాదులు కనిపిస్తాయి అన్నాడు.
జగన్ కడుతున్న ఇళ్లు సంసారానికి పనికిరావు అని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే మరీ అంత ఘోరంగా కడుతున్నారా అనుకున్నా. కానీ ఇప్పుడు కొన్ని వీడియోలు చూశాను. చేత్తో తోస్తే గోడలు పడిపోతున్నాయి. అంత చెత్త ఇళ్లు కడుతున్నాడు జగన్. ఇప్పటి వరకూ ఇందిరమ్మ ఇళ్లే చెత్త ఇళ్లు అనుకుంటే, ఆ రికార్డ్ ని జగన్ బద్దలు కొట్టాడు.
25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు జగన్. ప్రజలు 31 మంది ఎంపీలను ఇచ్చారు. కానీ, ప్రత్యేక హోదా సాధించాల్సిన వైసీపీ ఎంపీలు రాష్ట్రం పరువు తీస్తున్నారు. ఒక ఎంపీ జిప్పు విప్పి దేశం మొత్తం చూపించాడు. ఒక ఎంపీ మర్డర్ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక ఎంపీ యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఒక ఎంపీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుకున్న కొడుకుని కాపాడే పనిలో ఉన్నాడు. ఒక ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్ అయితే హైదరాబాద్ పారిపోయాడు. ఏ2 ఎంపీ ఏ స్కాంలో ఎంత వచ్చిందో లెక్కలు వేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఏ1 ప్యాలస్ లో పడుకున్నాడు. 31 ఎంపీలను గెలిపిస్తే జగన్ యువత చేతికి చిప్ప ఇచ్చాడు.
పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి కొంత మంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ థాంక్స్. వారు వెళ్లిపోయిన తర్వాత పార్టీ బలోపేతం అయ్యింది. దర్శి రూపురేఖలు మార్చేస్తాడని భారీ మెజారిటీతో మీరు మద్దిశెట్టి వేణుగోపాల్ ని గెలిపించారు. దర్శి అభివృద్ధి చెందిందా? మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? వేణుగోపాల్ జీవితం మాత్రం మారిపోయింది.
హైదరాబాద్ లో రూ.7 కోట్లు పెట్టి విల్లా కొన్నాడు, దర్శి నియోజకవర్గంలో 80 ఎకరాల భూమి కొన్నాడు, మార్టూరు లో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కొన్నాడు. దర్శిని అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చాడు. అందుకే ఆయన పేరు మార్చా... ఆయన పేరు వేణుగోపాల్ కాదు కలెక్షన్ గోపాల్. 2024 ఎన్నికల్లో టీడిపి అధికారంలోకి రావడం ఖాయం. దర్శిలో పసుపు జెండా ఎగరేయండి. దర్శి చరిత్రలో ఎప్పుడూ జరగని అభివృద్ధి చేస్తాం. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం. ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేస్తాం. దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తాం.
ముసి నదిపై వంతెన నిర్మిస్తాం. వెలిగొండ పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తాం. మొగిలి గుండాల రిజర్వాయర్ నిర్మిస్తాం. గుండ్లకమ్మ నదిపై లిఫ్ట్ ఏర్పాటు చేసి మోదేపల్లి నుండి గ్రామాలకు సాగునీరు అందిస్తాం. 17 రోజులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించాను. 8 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశాను. నన్ను ప్రజలు ఆదరించారు. మీరు చూపించిన ప్రేమ ఎప్పుడూ మర్చిపోలేను.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. భయం మా బయోడేటాలో లేదు. కేసులకు భయపడేది లేదు. ఎక్కువ కేసులు ఎవరి మీద ఉంటే వారికే నామినేటెడ్ పదవులు ఇస్తాం.