Andhra Pradesh Politics: పుంగనూరులో టీడీపీకి షాక్, మళ్లీ వైసీపి గూటికి చేరిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు కౌన్సిలర్లు
ఇటీవల టీడీపీ చేరిన చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు కౌన్సిలర్లు తిరిగి సోమవారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు.
ఇటీవల టీడీపీ చేరిన చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు కౌన్సిలర్లు తిరిగి సోమవారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. తల్లి లాంటి వైఎస్సార్‌సీపీ కుటుంబాన్ని వదిలి తప్పుచేశానని, అక్రమ కేసులు పెడతామని భయపెట్టడంవల్ల ఆత్మసాక్షిని చంపుకుని టీడీపీలో చేరామని వారు వెల్లడించారు. తమ తప్పు తెలుసుకుని తిరిగి పారీ్టలో చేరుతున్నట్లు అలీం బాషా తెలిపారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబంతోనే ఉంటామని వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాసమస్యలు గాలికొదిలేసి, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగి్నప్రమాదం జరిగితే.. కావాలనే ఫైల్స్ అన్నీ కాల్చేశారని, ఏమీ జరక్కపోయినా ఏదో జరిగిపోయినట్లు నానాయాగీ చేసి హెలికాప్టర్‌లో డీజీపీ, సీఎస్‌ని పంపించారని ఎంపీ గుర్తుచేశారు.