Kodali Nani Slams TDP: ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్కకు టీడీపీకి తేడా లేదు, చంద్రబాబు, జనసేనపై మండిపడిన కొడాలి నాని, ఇద్దరు కలిసినా జగన్‌ వెంట్రుక సైతం పీలకలేరంటూ ధ్వజం

చంద్రబాబు నాయుడితో పాటు జనసేన-బీజేపీ పొత్తుపై తనదైన శైలిలో విమర్శలు గుర్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే.. జనసేన పరిస్థితి ఏంటో చూశామన్నారు.

Gudivada MLA Kodali Nani (Photo-Video Grab)

Vjy, Dec 7: తెలుగు దేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు (Kodali Nani Slams TDP) చేశారు. చంద్రబాబు నాయుడితో పాటు జనసేన-బీజేపీ పొత్తుపై తనదైన శైలిలో విమర్శలు గుర్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే.. జనసేన పరిస్థితి ఏంటో చూశామన్నారు.

ఏపీలో తెలుగుదేశం, జనసేన పోటీ చేస్తే మళ్లీ జనసేన పరిస్థితి అదేనంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయకుడు అధికారం కోసం కాకుండా.. ప్రతిపక్షం కోసం జనసేనను కలుపుకున్నాడన్నారు. ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్క.. ఆ లారీని తానే మోస్తున్నానని అనుకుంటుందని, లారీ కింద దూరిన కుక్కకి టీడీపీ నేతలకు తేడా లేదంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని(YSRCP Gudiwada MLA kodali nani).

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం హైలెట్స్ ఇవిగో, ప్రగతి భవన్ టార్గెట్ చేస్తూ మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి

కాంగ్రెస్‌కు (Congress) వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ (TDP) రేవంత్‌రెడ్డిని వీళ్లే సీఎం చేసినట్లు ఫీల్‌ అవుతున్నారని, సిగ్గులేకుండా గాంధీ భవన్‌లో టీడీపీ జెండాలు పట్టుకుని గంతులేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే కదా, ఒక శిష్యుడు దిగిపోయి మరొక శిష్యుడు పదవిలోకి వచ్చాడని చెప్పారు. తన శిష్యులు సీఎంలు అవుతున్నారని చంద్రబాబు వెక్కివెక్కి ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు (Chandrababu) ప్రజలను పట్టించుకోకుండా హెరిటేజ్, ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే పట్టించుకున్నాడని ఫైర్‌ అయ్యారు.

కోటాను కోట్లు దోచుకుంటాడు కాబట్టే చంద్రబాబు వంటి పనికిరాని వాళ్లు చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తుచేశారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యతిరేకత ఉంటుందా? లేదా చంద్రబాబు దొంగ 420 అయినందుకు అనుకూలత ఉంటుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రావడం పగటికల అని అన్నారు.

తెలంగాణకు తొలి దళిత డిప్యూటీ సీఎం, తొలిసారిగా ఇద్దరు మహిళలకు మంత్రి వర్గంలో చోటు, సీఎం రేవంత్ రెడ్డి టీం బయోడేటా ఇదిగో..

తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీచేస్తే జనసేన పరిస్థితి ఏమైందో మనం చూశామని చెప్పారు. ఏపీలో చంద్రబాబుతో కలిసి జనసేన పోటీచేస్తే.. తెలంగాణ మాదిరిగానే అవుతుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం కోసమే చంద్రబాబు.. అసెంబ్లీలో అధ్యక్షా అనడం కోసం పవన్ కళ్యాణ్ పొత్తుపెట్టుకున్నారని మండిపడ్డారు. గుడివాడ వైఎస్సార్‌సీపీకి కంచుకోట అని, తాను బతికుండగా గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా దించడం ఎవరివల్లా కాదని అన్నారు.

ఎమ్మెల్యే అవ్వాలంటే టీడీపీతో కలవాలని పవన్‌ కల్యాణ్ అంటుకుంటున్నాడని విమర్శించారు. పవన్‌ ఎమ్మెల్యేగా గెలిచేందుకు పవన్‌.. ప్రతిపక్షం కోసమే చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారన్న కొడాలి నాని.. ఇద్దరు కలిసినా జగన్‌ వెంట్రుక సైతం పీలకలేరంటూ ధ్వజమెత్తారు. జగన్‌ సింహంలా సింగిల్‌గా వస్తాడని.. చంద్రబాబు పెద్ద 420 అని.. ఆయన అధికారంలోకి రావడం కలన్నారు.

రేవంత్ తెలంగాణలో గెలిస్తే.. ఏపీలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. గెలిస్తే తమ వారని, ఓడితే తమకు సంబంధం లేదని చెప్పటం టీడీపీ అలవాటేనన్నారు. హైదరాబాద్‌లో సెటిలర్‌తో ఓట్లు వేయించి.. కేసీఆర్‌ను ఓడిస్తామని చెప్పారని.. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ఒక్క సీటైనా గెలిచిందా అని ప్రశ్నించారు. గ్రేటర్‌ పరిధిలో బీఆర్ఎస్‌ భారీ మెజార్టీతో గెలిచిందని పేర్కొన్నారు. సిగ్గు లేకుండా గాంధీ భవన్‌కు టీడీపీ జెండాలతో వెళ్లి గంతులేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టారన్న నాని.. ఆ పార్టీ జెండాలను తీసుకుని చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ వెధవలు గాంధీభవన్‌కు వెళ్లారంటూ ధ్వజమెత్తారు. నా శిష్యులు ముఖ్యమంత్రులు అవుతున్నారు.. నేను ఇలా అయ్యాను ఎంటీ ? అని చంద్రబాబు ఏడుస్తున్నాడరని విమర్శించారు. చంద్రబాబులా పాలన చేస్తే ఒకసారి మాత్రమే అధికారంలోకి వస్తారని.. కేసీఆర్‌ రెండుసార్లు సీఎంగా పని చేశారని గుర్తుంచుకోవాలన్నారు.