YSRCP MPs Clarity on Party Change Rumors: వీడియో ఇదిగో, జగన్ వెంటే మేమంతా ఉంటామని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీలు, మేము రాజీనామా చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టేనని వెల్లడి
వైసీపీ నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారనే ప్రచారంలో నిజం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అన్నారు.
Vjy, August 30: వైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారనే హాట్ టాఫిక్ రూమర్స్ పై వైసీపీ ఎంపీలు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారనే ప్రచారంలో నిజం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ ఉండదని చెప్పారు. వాళ్లు స్వలాభం కోసం వెళితే... తాము పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తామని అన్నారు.
మేం పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేం వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వైస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి జగన్‌తో ఉన్నా.. నా వ్యక్తిత్వం ఏంటో అందరికి తెలుసు. నన్ను వైఎస్సార్ రాజకీయాల్లో ప్రోత్సహించారు. రఘునాధరెడ్డి, గొల్ల బాబూరావు కూడా రావాల్సి ఉంది. ఇతర కారణాల వలన రాలేకపోయారు. కానీ వారిద్దరు కూడా వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తామని చెప్పమన్నారు. జగన్ నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు. కానీ నా మీద కూడా ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది. నాకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని కూడా జగన్ అన్నారు. అంతగా వైఎస్ జగన్ నన్ను గౌరవించారు.
...కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా వైఎస్సార్ వెంటే ఉన్నాను. అప్పట్లో టికెట్ గురించి కూడా ఎవర్నీ అడిగేవాడిని కాదు. వైఎస్సారే నాకు అర్ధికంగా, రాజకీయంగా అండగా నిలిచారు. ఆ తర్వాత కూడా జగన్ అలాగే అండగా నిలిచారు. ఆర్థికంగా పేదవాడినే అయినా విధేయతలో సంపన్నుడునే. నాకు వ్యాపారల్లేవు, ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నాను. నా మీద వార్తలు రాసేటపుడు ఒకసారి మాట్లాడితే సరిపోయేది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది. ఇలా చేయటం రాజకీయ హననం చేసినట్లే. నైతికత ఉన్న నాయకుడిని నేను.
Hero's Video
..మేము రాజీనామా చేస్తే మరొకరిని నియమించే అవకాశం లేదు. అలాంటప్పుడు మేము రాజీనామా చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టే. అలాంటి కృతజ్ఞ హీనులం మేము కాదు. పార్టీని హత్య చేసే పని నేను చేయను. పార్టీ నుండి వెళ్లేవారు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే మంచిది. ఏ పార్టీ ఐనా ఓడుతుంది, గెలుస్తుంది. అధికారం శాశ్వతం కాదు, జయాపజయాలు సహజమే. వైఎస్సార్‌సీపీ ఇవాళ ఓడిపోయినంత మాత్రాన నేను పార్టీ వీడి వెళ్లను. నూటికి నూరుపాళ్లు వైఎస్ జగన్ నాయకత్వంలోనే పని చేస్తా. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్సార్‌సీపీలోనే ఉంటా’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు. చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం కొట్లాడతా, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య
ఇక బయటకు వెళ్లిపోతున్నారనే ప్రచారంలో నిజం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ ఉండదని చెప్పారు. వాళ్లు స్వలాభం కోసం వెళితే... తాము పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తామని అన్నారు. పదవి అంటే బాధ్యత, త్యాగంతో కూడుకున్నదని చెప్పారు. ఈ రోజుల్లో పార్టీలను నడపడం చాలా కష్టంగా మారుతోందని అన్నారు. అన్నీ అనుకున్నట్టే జరగాలనుకుంటే రాజకీయాల్లో కుదరదని చెప్పారు. తాను పార్టీ వీడే ప్రసక్తే లేదని రామిరెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా జగన్ వెంటే ప్రయాణం చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మోపిదేవికి ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ వంటి పదవులు ఇచ్చామని... ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పార్టీ మారితే విలువ ఉండదని అన్నారు. తమ వ్యక్తిత్వాలను దెబ్బతీసే వార్తలు రాసి, తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు. సామాన్యుల కోసం ఆలోచించే వ్యక్తి జగన్ అని... వాళ్ల కోసమే జగన్ పార్టీ పెట్టారని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే నా ప్రయాణం, పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు తానే ఓ క్లారిటీ ఇచ్చారు. తాను కూడా పార్టీ మారుతున్నానంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ట్విట్టర్లో మండిపడ్డారు. తాను ఎక్కడికీ వెళ్లట్లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీకి విధేయుడినని పునరుద్ఘాటించారు. అంకితభావం, నిబద్ధత కలిగిన కార్యకర్తనని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్సీపీలోనే ఉంటానని, వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తానని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీని వీడి మరో రాజకీయ పార్టీలో చేరుతున్నానంటూ మీడియాలోని ఒక వర్గం నిరాధారమైన, ఊహాజనిత ప్రచారం సాగిస్తోందని సాయిరెడ్డి అన్నారు. తప్పుడు సమాచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా చేస్తోన్న ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు విశ్వసించవద్దని కోరారు. నేను జగన్ సైనికుడిని, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన విజయసాయి రెడ్డి, వైఎస్‌ఆర్సీపీలోనే ఉంటానని స్పష్టం చేసిన వైసీపీ రాజ్యసభ ఎంపీ
పార్టీ మారడంపై రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి క్లారిటీ ఇస్తూ.. తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.కొందరు కావాలనే తనను రాజకీయం ఇబ్బంది పెట్టాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే ప్రయాణం అని అన్నారు. తాను పార్టీ మారుతున్నానని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇదంతా తప్పుడు ప్రచారం.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నేను వైఎస్సార్‌సీపీని వీడేది లేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు.
తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... పదవులు, ఆర్థిక అవసరాల కోసమే కొందరు వైసీపీని వీడుతున్నారని... వాళ్ల మాదిరి తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. జగన్ తనను గౌరవించారని... అందుకే తొలి నుంచి ఆయనకు మద్దతుగా ఉన్నానని అన్నారు. బీసీల కోసం కొట్లాడమనే ఆయన తనను రాజ్యసభకు పంపించారని చెప్పారు. తాను చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం కొట్లాడతానని చెప్పారు. సొంత వ్యాపారాలు, స్వప్రయోజనాల కోసం కొందరు పార్టీలు మారుతుంటారని... వారి మాదిరి పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని కృష్ణయ్య అన్నారు. తన బీసీ సంఘమే తనకు పార్టీ అని చెప్పారు.