వైసీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పు వ్యవహారం ఇప్పుడు ఏపీ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీ రాజీనామాలు చేశారు.ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు తానే ఓ క్లారిటీ ఇచ్చారు. తాను కూడా పార్టీ మారుతున్నానంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ట్విట్టర్లో మండిపడ్డారు. తాను ఎక్కడికీ వెళ్లట్లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీకి విధేయుడినని పునరుద్ఘాటించారు. అంకితభావం, నిబద్ధత కలిగిన కార్యకర్తనని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్సీపీలోనే ఉంటానని, వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తానని తేల్చి చెప్పారు..  రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే నా ప్రయాణం, పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి

వైఎస్సార్సీపీని వీడి మరో రాజకీయ పార్టీలో చేరుతున్నానంటూ మీడియాలోని ఒక వర్గం నిరాధారమైన, ఊహాజనిత ప్రచారం సాగిస్తోందని సాయిరెడ్డి అన్నారు. తప్పుడు సమాచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా చేస్తోన్న ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు విశ్వసించవద్దని కోరారు.

Here's Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)