Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్‌ సర్టిఫికెట్స్‌ కోర్స్‌ పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.

President Droupadi Murmu participates in first convocation of AIIMS Mangalgiri (photo/X/TDP)

Vjy, Dec 17: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం డిసెంబర్ 17న జరిగింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్‌ సర్టిఫికెట్స్‌ కోర్స్‌ పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.

అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలని ఆకాంక్షించారు. ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఇది. ప్రతి సంవత్సరం నిర్వహించాలి. పానకాల స్వామికి నా ప్రార్ధన.. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి.యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలి. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలి. ఎయిమ్స్‌ మొదటి బ్యాచ్‌గా మీరందరూ గుర్తుంటారని తెలిపారు.

వీడియో ఇదిగో, మందేసి చిందేసి బీజేపీ నేతకు ముద్దులు పెట్టిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ బర్త్‌డే పార్టీలో రచ్చ చేసిన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ

దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలి. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలి.మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తానని తెలిపారు.

President Droupadi Murmu participates in first convocation of AIIMS Mangalgiri

ప్రపంచపటంలో భారతదేశం మెడికల్‌ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి డాక్టర్ల సేవలు మరువలేనివని,ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయం.ప్రపంచపటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివి. ప్రతీ రోగికీ సేవలందించాలి.. ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి.యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలి’’ అని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) మాట్లాడుతూ రాష్ట్రపతిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మెడికల్‌ అనేది ఇప్పుడు మెడ్‌టెక్‌గా మారిపోయిందని అన్నారు ‘ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఇది.ప్రతి సంవత్సరం నిర్వహించాలి.కాన్వకేషన్ మీకు ఒక గుర్తింపు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాధారణ మహిళ, గిరిజన మహిళగా భారత ప్రథమ మహిళ అయ్యారు. ఉపాధ్యాయినిగా అంచెలంచెలుగా రాష్ట్రపతి అయ్యారు ’అని చంద్రబాబు అన్నారు.