Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, విజయవాడలో బుడమేరు వాగు ఉగ్రరూపం, ప్రవాహ తీవ్రత దెబ్బకు వెనక్కి ప్రవహిస్తున్న నది, తీవ్ర భయాందోళనలో ప్రజలు
ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెనక్కి ప్రవహిస్తోంది. దీంతో విద్యా ధరపురం ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డు మొత్తం నీట మునిగింది. ఇళ్ళలోకి బుడమేరు వాగు నీరు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
విజయవాడ నగరంలో బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెనక్కి ప్రవహిస్తోంది. దీంతో విద్యా ధరపురం ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డు మొత్తం నీట మునిగింది. ఇళ్ళలోకి బుడమేరు వాగు నీరు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత పదేళ్ళ క్రిందట కృష్ణానది ఒడ్డు దాటి వచ్చింది కానీ.. ఇలా బుడమేరు వాగు నీరు వెనక్కి ప్రవహించడం ఇదే మొదటిసారి అని స్థానిక ప్రజలు అంటున్నారు. వీడియో ఇదిగో, బైక్‌పై వెళ్తూ వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడు, అందరూ చూస్తుండగానే వరదలో బైకుతో సహా కొట్టుకుపోయిన వైనం
బాపట్ల జిల్లాలోని కొల్లూరు మండలం అరవింద వారధి దగ్గర కృష్ణానదికి గండి పడింది. గతంలో ఓసారి ఈ గండి పడితే ఇసుక సంచులతో కప్పి గండి పూడ్చిగా.. మళ్లీ వరద ఉధృతికి గండి తెగిపోవడంతో ఇటుక బట్టీల్లోకి, పంట పొలాల్లోకి వరద నీరు చొరబడుతుంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ రాత్రికి వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం మరింత ఉంది. దీంతో కొల్లూరు మండల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Here's Videos