Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం పర్యటన
సోమవారం ఉదయం నుంచి ముంపు ప్రాంతాల్లో సుమారు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటించారు.
విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం నుంచి ముంపు ప్రాంతాల్లో సుమారు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటించారు. యనమలకుదురు, పటమట, రామలింగేశ్వర నగర్, జక్కంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లోనూ పర్యటించారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
వాహనం వెళ్లగలిగినంత దూరం అందులో.. మిగిలిన చోట్ల కాలినడక వెళ్లారు. కొన్నిచోట్ల మోకాలి లోతు నీటిలోనూ నడుచుకుంటూ వెళ్లారు. బురదలో కాలినడకనే తన పర్యటనను కొనసాగించారు. మరింత ఎక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో బోటు ద్వారా బాధితుల వద్దకు చేరుకుని వారితో స్వయంగా మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులు చెప్పే ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆదుకుంటుందని.. ధైర్యంగా ఉండాలంటూ ప్రజల్లో భరోసా కల్పించారు.
విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో జేసీబీ ఎక్కి పర్యటించారు. కృష్ణలంక, పటమట, యనమలకుదురు, భవానీపురం, రామలింగేశ్వరనగర్, జక్కంపూడిలో ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో... చంద్రబాబు జేసీబీ సాయంతో పర్యటించి బాధితులను పరామర్శించారు.
Here's Videos
ఓ వైపు పరామర్శలు, మరోవైపు సహాయక చర్యలను చంద్రబాబు సమాంతరంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగారు. అక్కడిక్కడే అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.