Corona in Andhra Pradesh: తూర్పు గోదావరిలో అత్యధికంగా 265 కేసులు, ఏపీ స్కూళ్లలో కరోనా కలవరం, తాజాగా రాష్ట్రంలో 1,002 కొత్త కేసులు, 12 మంది మృతి, ప్రస్తుతం 14,159 యాక్టివ్ కేసులు
12 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,508 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,159 యాక్టివ్ కేసులు (Covid in AP) ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
Amaravati, August 23: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 74,972 మంది నమూనాలు పరీక్షించగా 1,002 కొత్త కేసులు (Coronavirus) నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,508 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,159 యాక్టివ్ కేసులు (Covid in AP) ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశంలో ఒకరు చొప్పున మరణించారు. నేటి వరకు రాష్ట్రంలో 2,61, 39, 934 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.
24 గంటల్లో పశ్చిమగోదావరి జిల్లాలో 24 కేసులు నమోదు కాగా, చిత్తూరులో 113 కేసులు, ప్రకాశం జిల్లాలో 86 కేసులు, గుంటూరులో 64 కేసులు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 265 కేసులు, కడపలో 132, నెల్లూరులో 118 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 7 కేసులు నమోదు కాగా, అనంతపూర్ లో 11 కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో 74 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 19 కేసులు, విశాఖలో 54 కేసులు, విజయనగరంలో 35 కేసులు నమోదయ్యాయి.
మొత్తం మరణాల సంఖ్య 13723కు చేరుకోగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 19,73,940కు చేరుకుంది. మొత్తం కేసులు 20,00,447కు (Corona in Andhra Pradesh) చేరుకున్నాయి. డిశ్చార్జ్ కేసులు 19,72,553 కు చేరుకోగా, ఇప్పటివరకు 13,735 మంది కరోనాతో మరణించారు.
Here's AP Covid Report
ఏపీలో పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో డీఆర్ఎం మున్సిపల్ స్కూలులో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు చిన్నారులు కరోనా బారిన పడ్డారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపీసీ కండ్రిగలోని స్కూలులో ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు హైస్కూల్లో 10 మందికి కరోనా సోకింది. దీంతో ఈ పాఠశాలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు.