Corona in AP: పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 137 కేసులు, ఏపీలో కొత్తగా 1,085 మందికి కరోనా, తాజాగా 8 మంది మృతి, 1,541 మంది కోలుకుని డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 14,677 యాక్టివ్‌ కేసులు

గడచిన 24 గంటల్లో 57,745 మంది నమూనాలు పరీక్షించగా 1,085 కొత్త కేసులు (Coronavirus) నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,541 మంది కోలుకున్నారు.

COVID Outbreak - Representational Image (Photo-PTI)

Amaravati, August 22: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 57,745 మంది నమూనాలు పరీక్షించగా 1,085 కొత్త కేసులు (Coronavirus) నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,541 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,677 యాక్టివ్‌ కేసులు (Covid in AP) ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణాలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. నేటి వరకు రాష్ట్రంలో 2,60, 91, 962 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.

24 గంటల్లో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 137 కేసులు నమోదు కాగా, చిత్తూరులో 130 కేసులు, ప్రకాశం జిల్లాలో 122 కేసులు, గుంటూరులో 116 కేసులు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 105 కేసులు, నెల్లూరులో 108 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో అత్యల్పంగా 10 కేసులు నమోదు కాగా, అనంతపూర్ లో 29 కేసులు నమోదయ్యాయి.

రాహుల్‌ హత్యకేసు..పోలీసులకు లొంగిపోయిన నిందితుడు కోరాడ విజయ్‌, రహస్యప్రాంతంలో నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేసిన మాచవరం పోలీసులు

కడపలో 32 కేసులు, కృష్ణాలో 99 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 42 కేసులు, విశాఖలో 99 కేసులు, విజయనగరంలో 56 కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 13723కు చేరుకోగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 19,73,940కు చేరుకుంది. మొత్తం కేసులు 2002340కు చేరుకున్నాయి.