COVID in Andhra Pradesh: కరోనా థర్ఢ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్, తాజాగా 2,498 మందికి కరోనా పాజిటివ్

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 481 కొత్త కేసులు (Coronavirus in Andhra Pradesh) నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 336, పశ్చిమ గోదావరి జిల్లాలో 326, కృష్ణా జిల్లాలో 263, చిత్తూరు జిల్లాలో 245 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 24 పాజిటివ్ కేసులు గుర్తించారు.

CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, July 20: ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 88,149 శాంపిల్స్ పరీక్షించగా 2,498 మందికి కరోనా పాజిటివ్ గా (COVID in Andhra Pradesh) నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 481 కొత్త కేసులు (Coronavirus in Andhra Pradesh) నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 336, పశ్చిమ గోదావరి జిల్లాలో 326, కృష్ణా జిల్లాలో 263, చిత్తూరు జిల్లాలో 245 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 24 పాజిటివ్ కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,201 మంది కరోనా ఉంచి కోలుకోగా, 24 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు కన్నుమూశారు. తాజా మరణాలతో కలిపి నేటివరకు 13,178 మంది కరోనాకు బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,44,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,07,201 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 23,843 మంది చికిత్స పొందుతున్నారు.

కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సమర్థ నిర్వహణ ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగామన్నారు. గర్భిణీలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా కొనసాగాలన్నారు. థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఏపీలో మరో వారంపాటు నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు, కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్

పీడియాట్రిక్‌ సూపర్‌కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలి. పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌కేర్‌ ఎక్విప్‌మెంట్‌తోపాటు వైద్యులను నియమించాలి. కమ్యూనిటీ ఆస్పత్రుల స్థాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉండాలి. సబ్‌ సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటన్‌నెట్‌ సౌకర్యం ఉండాలని’’ సీఎం జగన్‌ ఆదేశించారు.