Covid in AP: ఏపీలో కరోనాపై ఊరట, కేసులు తగ్గుతుంటే డిశ్చార్జ్ రేటు పెరుగుతోంది, తాజాగా 2,930 మందికి కరోనా, గడిచిన 24 గంటల్లో 4,346 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

Amaravati, July 3: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 90,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,930 మందికి (Covid in AP) కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 36 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,815 కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 4,346 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 51 వేల 62 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 35,871 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,22,68,483 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చిత్తూరు జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

జగన్ సర్కారు సంచలన నిర్ణయం, రైతుల ఇంటికే నేరుగా బ్యాంకింగ్ సేవలు, రూ.25వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం, వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సన్నాహాలు, శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు

దేశంలో కరోనా అదుపులోకి వస్తోంది. తాజాగా 18,76,036 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 44,111 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు కంటే 5 శాతం తగ్గుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3,05,02,362కి (Covid in India) చేరాయి. 24 గంటల వ్యవధిలో 738 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఏప్రిల్ 8నాటి కనిష్ఠానికి చేరింది. ఇప్పటివరకు 4,01,050 మంది మహమ్మారికి బలయ్యారు. మరో వైపు దేశంలో యాక్టివ్‌ కేసులు 95 రోజుల తర్వాత 5లక్షలకు దిగువకు చేరాయి. ప్రస్తుతం 4,95,533 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది.