AP Covid Update: ఏపీలో మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా, ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, కరోనా నియంత్రణకు కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు, తాజాగా 5,963 మందికి కరోనా, 27 మంది మృతి

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రూ. 100 జరిమానా విధించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ పరిస్థితులపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Coronavirus Cases in India (Photo Credits: PTI)

Amaravati, April 20: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ లోనూ భారీ సంఖ్యలో ప్రాణాలను బలి గొంటోంది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 27 మంది కరోనాకు ( 27 deaths) బలయ్యారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఆరుగురు మరణించగా, చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,437కి పెరిగింది.గత 24 గంటల్లో 37,765 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,963 మందికి పాజిటివ్ అని నిర్ధారణ (5963 new positive cases) అయింది.

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,182 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు తర్వాత అధిక కేసులు గుంటూరు (938), శ్రీకాకుళం (893), తూర్పు గోదావరి (626), విశాఖ (565) జిల్లాల్లో గుర్తించారు. అత్యల్పంగా విజయనగరంలో 19, పశ్చిమ గోదావరిలో 19 కేసులు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు ఏపీలో 9,68,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 9,12,510 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 48,053 మందికి చికిత్స జరుగుతోంది.

రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం చైర్మన్‌గా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి నియమితులయ్యారు. తక్షణమే బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్‌19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రతిరోజు పర్యవేక్షిస్తుంది.

1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు, షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు, మే 5 నుంచి 23 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు, మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం జగన్

కరోనా వ్యాప్తి నియంత్రణలోకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి ఆళ్ల నాని కన్వీనర్‌గా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులుగా హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు బొత్స, బుగ్గన, కన్నబాబు. కరోనా నియంత్రణకు కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశారు. కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఉపసంఘం సలహాలు, సూచనలు చేయనుంది.

రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రైతుల ఖాతాల్లోకి రూ.128.47 కోట్లు జమ,ఈ ఏడాది 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ వర్తింపు, ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని అందించిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో మాస్క్ ధరించకపోతే భారీ జరిమానా విధించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రూ. 100 జరిమానా విధించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ పరిస్థితులపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.



సంబంధిత వార్తలు