AP Covid Update: ఏపీలో పరుగులు పెడుతున్న సెకండ్ వేవ్, తాజాగా 7,224 మందికి కరోనా, చిత్తూరులోనే అత్యధికంగా గత 24 గంటల్లో 1051 కేసులు నమోదు, అత్యల్పంగా వెస్ట్ గోదావరిలో 96 కేసులు
మొత్తం 35, 907 శాంపిల్స్ పరీక్షించగా రాష్ట్రంలో కొత్తగా 7,224 కరోనా కేసులు నమోదు కాగా, కోవిడ్ వైరస్ తో 15 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,55,455కి కరోనా కేసులు చేరగా, ఇప్పటివరకు కరోనా వైరస్ తో 7,388 మరణించారు. ఏపీలో 40,469 యాక్టివ్ కేసులు ఉండగా, 9,07,598 మంది రికవరీ అయ్యారు.
Amaravati, April 17: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. మొత్తం 35, 907 శాంపిల్స్ పరీక్షించగా రాష్ట్రంలో కొత్తగా 7,224 కరోనా కేసులు నమోదు కాగా, కోవిడ్ వైరస్ తో 15 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,55,455కి కరోనా కేసులు చేరగా, ఇప్పటివరకు కరోనా వైరస్ తో 7,388 మరణించారు. ఏపీలో 40,469 యాక్టివ్ కేసులు ఉండగా, 9,07,598 మంది రికవరీ అయ్యారు.
కరోనా వల్ల చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, కడప. విజయనగరం, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడచిన 24 గంటల్లో 2,332 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 1, 56, 42, 070 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.
తాజాగా 13 జిల్లాల్లో కేసులను ఓ సారి పరిశీలిస్తే.. అనంతపురంలో 420 కేసులు నమోదు కాగా చిత్తూరులో అత్యధికంగా 1051 కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ గోదావరిలో 906, గుంటూరులో 903, కపడలో 200, కృష్ణాలో 493, కర్నూలులో 507, నెల్లూరులో 624, ప్రకాశంలో 588, శ్రీకాకుళంలో 662, విజయనగరంలో 304, విశాఖపట్నంలో 470, వెస్ట్ గోదావరిలో 96 కేసులు నమోదయ్యాయి.