AP Coronavirus: ఏపీలో ఒక్కరోజే 8 మంది మృతి, తాజాగా 407 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, ఏపీలో 9834కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య
వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 20,369 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 462 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గడిచిన 24 గంటల్లో 129 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కాగా 8 మంది మరణించారు.
Amaravati, June 23: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 407 కరోనా పాజిటివ్ కేసులు (AP coronavirus) నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 20,369 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 462 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గడిచిన 24 గంటల్లో 129 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కాగా 8 మంది మరణించారు. ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి కరోనా, శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ
కరోనాతో (COVID-19 Deaths) చనిపోయిన ఈ ఎనిమిది మంది కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాలకు చెందినవారుగా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 9834 మంది (AP Coronvirus Report) ఈ మహమ్మారి వైరస్ బారిన పడగా.. 4592 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 119 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఏపీలో 5123 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో తూర్పుగోదావరి(87), అనంతపురం(68) జిల్లాలలో అత్యధికంగా నమోదయ్యాయి. దేశంలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 14,933 పాజిటివ్ కేసులు నమోదు, దేశ వ్యాప్తంగా 4,40,215కి చేరిన కేసులు సంఖ్య, ప్రపంచ వ్యాప్తంగా 91 లక్షలు దాటిన కేసులు
విజయనగరం జిల్లాలో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పోలీస్ శాఖలోని పలువురు అధికారులు, సిబ్బందిని తాకిన వైరస్.. తాజాగా రెవెన్యూశాఖలో ప్రవేశించింది. డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఈ నెల 21 వరకూ 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 మంది కోలుకున్నారు. ఇంకా 83 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే 21 కొత్త కేసులు వెలుగుచూశాయి.