Kurnool Tragedy: నిద్రమత్తు..రెప్పపాటులో అంతా జరిగిపోయింది, కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు

టెంపో- లారీ ఢీ కొన్న ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి (Andhra Pradesh Road Accident) చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు.

Andhra Pradesh road accident (Photo Credits: ANI)

Kurnool, February 14: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో- లారీ ఢీ కొన్న ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి (Andhra Pradesh Road Accident) చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఈ ఘటన (Kurnool Tragedy) చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలింపు తరలించారు. గాయాలపాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మదనపల్లె నుంచి ఆజ్మీర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.

ప్రమాద ఘటన (Andhra Pradesh Tragedy) జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన యాస్మిన్, ఆస్మా, కాశీం(10), ముస్తాక్‌ (12)ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. టెంపో వాహనం నుజ్జునుజ్జు కావడంతో మృత దేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. పోలీసులు క్రేన్‌ సాయంతో టెంపో వాహనం నుంచి మృత దేహాలను బయటకు తీశారు.

Here's ANI Tweet

మృతదేహాల వద్ద లభించిన ఆధార్‌కార్డులు, ఫోన్‌ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్‌లోని బాలాజీ నగర్‌కు చెందిన రఫీ, జాఫర్, దస్తగిరి కుటుంబాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మదనపల్లి నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

ఘోర రోడ్డు ప్రమాదం, 80 అడుగుల లోతులో పడిపోయిన బస్సు, నలుగురు మృతి, 23 మందికి గాయాలు, విశాఖ అరకులో విషాద ఘటన, తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఇతరులు

కర్నూలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు

ప్రమాద ఘటనపై (Bus And Truck Collide) ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై చిత్తూరు జిల్లా అధికారులతో విచారణకు మంత్రి ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు.

రెజ్లింగ్‌ శిక్షణ కేంద్రంలో కాల్పుల కలకలం, ఐదుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన పోలీసులు, రెజ్లింగ్‌ కోచ్‌ల మధ్య ఉన్న విభేదాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

రోడ్డు ప్రమాదంపై మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో 14 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని,రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు సూచించారు.

ప్రమాద ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంలో 14 మంది చనిపోవడం కలిచివేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని తెలిపారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు.

కాగా టెంపో మినీ బస్సు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ వెల్లడించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయ సహకారాలు అందించి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. ప్రమాద కారణాలను ప్రత్యేక సాంకేతిక బృందంతో సమగ్ర విచారణ చేపడుతున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. మృతుల వివరాలను చిత్తూరు జిల్లా అధికారులకు సమాచారం అందించామని ఆయన తెలిపారు.