Andhra Pradesh Shocker: పుల్లుగా మందు తాగి ప్రైవేట్ పార్టులో టీవీ రిమోట్ పెట్టుకున్న యువకుడు, అది లోపల ఇరుక్కుపోవడంతో ఆస్పత్రికి పరుగులు, తర్వాత కథ ఇదే..
ఓ యువకుడు ఫుల్లుగా తాగి మలద్వారంలో టీవీ రిమోట్‌ను చొప్పించుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి నొప్పిగా ఉండటంతో జిల్లాలోని సర్వజన ఆసుపత్రికి వెళ్లాడు.
Vjy, May 19: ఇటీవల కాలంలో చాలా మంది మద్యం మత్తులో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. తాజాగా ఓ యువకుడు మద్యం మత్తులో మలద్వారంలో టీవీ రిమోట్‌ను చొప్పించుకున్న షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పెనుగొండలో ఆశ్చర్యకరమైర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు ఫుల్లుగా తాగి మలద్వారంలో టీవీ రిమోట్‌ను చొప్పించుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి నొప్పిగా ఉండటంతో జిల్లాలోని సర్వజన ఆసుపత్రికి వెళ్లాడు.
అతడిని పరీక్షించిన వైద్యులు అతని మలద్వారంలో టీవీ రిమోట్ ఉండటం గమనించారు. దీంతో గంటపాటు శ్రమించి ఎలాంటి శ్రస్త్ర చికిత్స లేకుండా రిమోట్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యంగా నిలకడగా ఉంది.ఈ ఘటనపై ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్ మీడియాకు ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి చెందిన యువకుడు గురువారం సాయంత్రం ఫుల్‌గా తాగి మద్యం మత్తులో అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చాడు. మలద్వారం వద్ద నొప్పిగా ఉందని తెలపడంతో వైద్యులు పరిశీలించారు.
ఆ ప్రదేశంలో టీవీ రిమోట్‌లోని కొంత భాగం కనిపించింది. లాగితే బయటకు రాలేదు. ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ రామస్వామినాయక్ ఆదేశాల మేరకు బాధితున్ని అడ్మిట్ చేసుకుని.. సర్జన్ రష్మి, పీజీ వైద్యురాలు లీలా మౌనిక, డాక్టర్ దివ్య, అనస్తీషియా వైద్యులు డాక్టర్ మురళీ ప్రభాకర్, డాక్టర్ హరికృష్ణ, స్టాఫ్‌నర్సు నాగలక్ష్మి బృందం మత్తు మందు ఇచ్చి గంటపాటు శ్రమకోర్చి సర్జరీ చేయకుండానే చేతితోనే రిమోట్‌ను బయటకు తీశారు. వైద్య బృందాన్ని ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు.