Andhra Pradesh Shocker: నెల్లూరు జిల్లాలో దారుణం, అత్యాచారానికి సహకరించలేదని బాలిక నోట్లో యాసిడ్ పోసి.. ఆపై గొంతు కోసిన ఉన్మాది
అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్ (attacked with acid in Nellore) పోసిన నిందితుడు ఆపై గొంతు (Girl's throat slit) కోశాడు.
Nellore, Sep 6: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్ (attacked with acid in Nellore) పోసిన నిందితుడు ఆపై గొంతు (Girl's throat slit) కోశాడు. వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. చెముడుగుంట పంచాయతీ నక్కలకాలనీకి చెందిన 14ఏళ్ల బాధిత బాలిక నెల్లూరులోని ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. బాలికను ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు నిన్న సాయంత్రం బయటకు వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.
అతడి నుంచి తప్పించుకున్న బాలిక వాష్‌రూములోకి వెళ్లి తలుపులు మూసే ప్రయత్నం చేసింది. తలుపులు బలంగా నెట్టి లోపలికి వెళ్లిన నిందితుడు అత్యాచారానికి యత్నించాడు.ఆమె మరోమారు అతడిని ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నాగరాజు వెంట తెచ్చిన యాసిడ్‌ను ఆమె ముఖంపైనా, నోట్లోను పోశాడు. బాధతో బాలిక పెద్దగా కేకలు వేయడంతో గొంతు కోసి పరారయ్యాడు. చుట్టుపక్కల వారు వచ్చి జరిగిన ఘాతుకాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
వారొచ్చి రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.విషయం తెలుసుకున్న సీఐ గంగాధర్, ఎస్‌ఐ అయ్యప్ప నక్కలకాలనీ, ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి విచారించారు. అయితే.. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఒక్కరా, లేక ఇద్దరు ముగ్గురు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గత రాత్రి నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయరావు, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరామర్శించారు.