Guntur Shocker: బైక్ ఎక్కలేదని భార్యను కత్తితో పొడిచిన భర్త, గుంటూరులో దారుణం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

భార్య గొంతును భర్త కోసిన సంఘటన (Guntur Shocker) దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఇరికేపల్లి జంగాల కాలనీలో గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో తన భార్య అల్లూరి భవానీ గొంతును భర్త సుధాకర్‌ కత్తితో కోసి (Husband killed his Wife) పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు భవానీ తన భర్త సుధాకర్‌పై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Amaravati, Sep 4: గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. భార్య గొంతును భర్త కోసిన సంఘటన (Guntur Shocker) దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఇరికేపల్లి జంగాల కాలనీలో గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో తన భార్య అల్లూరి భవానీ గొంతును భర్త సుధాకర్‌ కత్తితో కోసి (Husband killed his Wife) పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు భవానీ తన భర్త సుధాకర్‌పై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇద్దరూ పిల్లలతో కలిసి సుధాకర్, భవానీ, భవానీ తల్లి మాచర్లలో జరిగిన వివాహానికి గురువారం ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో సుధాకర్‌ వాహనాన్ని అతివేగంతో నడపటంపై భార్య అభ్యంతరం వ్యక్తం చేసి దిగింది.భవానీతోపాటుగా పిల్లలు, ఆమె తల్లి బస్సులో ఇంటి కి చేరుకున్నారు. తనతో పాటు రాలేదని ఆగ్రహంతో ఊగిపోయిన సుధాకర్‌ ఇంటికి వచ్చిన తరువాత భార్య భవానీతో గొడవకు దిగాడు.

వీడు మనిషేనా, తన పురుషాంగాన్ని కోసి రోడ్డు మీద విసిరేశాడు, కారణం ఈ ప్రపంచాన్ని కాపాడటానికట, యూఎస్‌లోని టేనస్సీలో దారుణ ఘటన

ఈ క్రమంలో సుధాకర్‌ కత్తితో భార్య భవానీ గొంతు కోసి పరారయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు భవా నీ దాచేపల్లిలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. గొంతుకు 16 కుట్లు పడ్డాయి. తన భర్త చేసిన దాడిపై బాధితురాలు భవానీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ ఈ.బాలనాగిరెడ్డికి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif