Andhra Pradesh Shocker: పెళ్లెన నెలకే భార్యపై కత్తితో దాడి చేసిన భర్త, మరో ఘటనలో ప్రేమ పేరుతో యువతితో కోరికలు తీర్చుకుని తరువాత వేరే పెళ్లికి సిద్ధమైన ప్రియుడు

ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి (Husband brutally attacks wife) చేశాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం ఆమెను ఒంగోలు హాస్పిటల్‌కు (condition critical ) తరలించారు. దాడి చేసిన భర్త పరారీలో ఉన్నాడు.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Ongole, Feb 3: ఏపీలో ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం పోతవరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి (Husband brutally attacks wife) చేశాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం ఆమెను ఒంగోలు హాస్పిటల్‌కు (condition critical ) తరలించారు. దాడి చేసిన భర్త పరారీలో ఉన్నాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పావని, సాయికుమార్‌ దంపతులు గత నెల 18న ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం కొద్ది కాలానికే భర్త వేధిస్తున్నాడని పావని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త సాయికుమార్‌.. పావనిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లయి నెలకూడా తిరక్కుండానే ఈ దారుణం చోటుచేసుకోవడంతో భార్యభర్తల మధ్య గొడవకు మరేదైన కారణం ఉందేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు.

మరో ఘటనలో ఐదేళ్లుగా ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. ఆ తరువాత శారీరకంగా దగ్గరై, ఇప్పుడు వేరే యువతిని వివాహం చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఆ యువకుడిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి బాధిత యువతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

జీవితం మీద విరక్తి, బతకాలని లేదంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య, నన్ను క్షమించాలని, నా చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్

పెదతీనార్లలకు చెందిన కారే ఆశ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఇదే గ్రామానికి చెందిన మైలపల్లి రాము అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఇద్దరం భార్యాభర్తలమే నువ్వేమి అనుమానం పడక్కర్లేదంటూ కర్నాటక, హంపి,హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాడు. శారీరకంగా అనుభవించాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగితే కట్నం ఇవ్వలేరన్న కారణంతో తిరస్కరించి ఈనెల 2వ తేదీన వేరే యువతిని వివాహం చేసుకునేందుకు మూహూర్తం పెట్టుకున్నాడు.

విషయం తెలిసి నిలదీస్తే, నువ్వంటే ఇష్టమేనని కానీ మా తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకోలేనని ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ పెద్దలు రాము తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. ఇద్దరికీ వివాహం చేయాలని కోరారు.అయితే రాము కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యుల సాయంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన వ్యక్తితో తనకు పెళ్లి జరిపించి, న్యాయం చేయాలని కోరింది. ఇద్దరూ కలిసి వివిధ ప్రాంతాల్లో తీసుకున్న ఫొటోలు, వాట్సాప్‌ చాటింగ్‌ను ఆమె పోలీసులకు చూపించింది. దీనిపై ఎస్‌ఐ వెంకన్నను వివరణకోరగా మెలపల్లి రాముపై బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేశామని తెలిపారు.