Andhra Pradesh Shocker: 6 ఏళ్ల పసి బాలుడిని దారుణంగా రేప్ చేసిన కామాంధుడు, చాక్లెట్ ఆశ చూపి పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం, కృష్ణా జిల్లాలో హేయమైన ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో (krishna) చోటుచేసుకుంది.
Amaravati, August 24: వీడు మనిషా లేక కామాంధుడా..పసిబాలుడిపై ఓ మృగాడు దారుణంగా అత్యాచారానికి (sexual-assault-on-6-year-old-boy) పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో (krishna) చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొండపల్లిలోని శాంతినగర్ ఇందిరమ్మ కాలనీలో ఆరేళ్ల బాలుడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ కొనుక్కొనేందుకు డబ్బులు ఇస్తానని ఆశచూపి పక్కనే ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి బాలుడిపై దారుణానికి (Sexual assault) ఒడిగట్టాడు.
దీంతో అస్వస్థతకు గురైన బాలుడు సృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకొని ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు.
బాలుడిని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అఘాయిత్యానికి గురై ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలుడిని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు.బాలుడిపై లైంగిక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.