Andhra Pradesh Shocker: నంద్యాలలో దారుణం, 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం, ఎవరికైనా చెబుతుందనే భయంతో కాల్వలోకి తోసి చంపేసిన కామాంధులు
ఈ విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏపీలోని నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యూపీలో రెచ్చిపోయిన కామాంధులు, బాలికకు నిద్రమాత్రలు ఇచ్చి 10 రోజుల పాటు దారుణ అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆదివారం సాయంత్రం ముచ్చుమర్రి పార్కు వద్ద బాలిక ఆడుకుంటుండగా సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటపడుతుందనే భయంతో బాలికను కాల్వలోకి తోసేశామని చెప్పినట్లు వెల్లడించారు. నిందితుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు జాగిలాల సాయంతో బాలిక ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.