Guntur Shocker: రూ 20 వేల లోన్‌కి రూ. 2 లక్షల వసూలు చేసిన ఆన్‌లైన్ లోన్‌ యాప్ నిర్వాహకులు, ఇంకా కట్టాలని వివాహితకు వేధింపులు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు

ఆన్‌లైన్ లోన్‌ యాప్ వేధింపులు తట్టుకోలేక గుంటూరు జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య ( woman ends life over harassment) చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామంలో చోటు చేసుకుంది.

Representational Picture. Credits: PTI

Guntur, July 12: ఏపీలో గుంటూరు జిల్లాలో విషాదం (Guntur Shocker) చోటు చేసుకుంది. ఆన్‌లైన్ లోన్‌ యాప్ వేధింపులు తట్టుకోలేక గుంటూరు జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య ( woman ends life over harassment) చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్‌ బుల్స్‌, రూపెక్స్‌ యాప్స్‌ నుంచి రూ.20,000 లోన్‌ తీసుకుంది. రూ.20 వేల రుణానికి లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు.

అయినా ఇంకా డబ్బులు కట్టాలని, లేకుంటే ప్రైవేటు ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడతామని లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు ( online money lending apps in Guntur) బెదిరించారు. ఈ రుణం తీర్చకపోతే బంధువులకు ఫోన్‌ చేసి చెప్తానని సైబర్‌ నేరగాళ్లు భయపెట్టారు. అంతే కాకుండా వాట్సాప్‌లో అసభ్యకర మెసెజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేశారు.

హత్యకు ప్రతీకారం..క్షుద్రపూజలతో మహిళను చంపినందుకు మంత్రగాడిని సజీవ దహనం చేసిన గ్రామస్థులు, అస్సాంలో దారుణ ఘటన

దీంతో మనస్తాపం చెందిన ప్రత్యూష ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు తల్లిదండ్రులకు, భర్తకు సెల్ఫీ వీడియో పంపింది. ఈ మేరకు ప్రత్యూష భర్త మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.