Parvathipuram Road Accident: మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఆరుమంది అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి తీవ్ర తీవ్ర గాయాలు
కొమరాడ మండలం చోళపదం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Manyam, Feb 22: ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Parvathipuram Road Accident) జరిగింది. కొమరాడ మండలం చోళపదం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పెళ్లికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తున్న సమయంలో చోళపదం వద్ద లారీ ఢీకొట్టింది.
మృతులకు సంబంధించి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరొక విషాదకర ఘటనలో రాయ్‌పూర్: రిసెప్షన్‌కు కొన్ని గంటల ముందే నవ దంపతులు తమ ఇంట్లోని గదిలో శవాలుగా కన్పించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని బ్రిజన్‌గర్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఇద్దరి ఒంటిపై కత్తిగాయాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. భార్యభర్తలిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. భర్త తన భార్యను పొడిచి చంపిన తర్వాత, తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పేర్కొన్నారు.
ఈ దంపతులు గదిలోకి వెళ్లి తాళం వేసుకొని గొడవపడ్డారని, అరుపులు కేకలు వినిపించాయని కుటంబసభ్యులు చెప్పారు. లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోడవంతో కిటీకీలోనుంచి చూస్తే ఇద్దరు రక్తపుమడుగులో కన్పించారని పేర్కొన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీరా చూస్తే ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భర్తే భార్యను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఇతర కోణాల్లోనూ విచారణ జరుపుతామన్నారు.