Representational Image | (Photo Credits: IANS)

Warangal, Feb 22: వరంగల్ జిల్లాలో మంగపేట మండలంలో ఇద్దరు టీచర్ల మధ్య వివాహేతర సంబంధాన్ని భర్త బట్టబయలు చేశాడు. వారిని రెడ్‌హ్యాండెడ్‌గా (Govt teacher caught red-handed ) పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఉపాధ్యాయురాలి భర్త, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. మరో ఉపాధ్యాయురాలితో ( AR Constable wife) కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుపుతున్నాడు.

ఉపాధ్యాయురాలి భర్త మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.దీంతో కూతురితో మంగపేటలో అద్దె ఇంట్లో ఉంటున్న ఉపాధ్యాయురాలు, అప్పటికే ఇద్దరు భార్యలను వదిలేసి ఒంటరిగా ఉంటున్న ఉపాధ్యాయుడు నాగేందర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సెలవు రోజుల్లో వచ్చి వెళ్తే భర్తను పట్టించుకోవడం మానేసింది. అనుమానం వచ్చి కూతురు ద్వారా ఆరా తీయగా అసలు విషయం తెలుసుకున్నాడు.

నీ భర్త.. కాదు.. కాదు నీ భర్తే.. రేప్ చేశాడంటూ ఒకరి భర్తపై మరొకరు ఫిర్యాదు చేసుకొన్న ఇరుగుపొరుగు మహిళలు.. కాన్పూర్ లో ఘటన

ఈ విషయంపై రెండు నెలల క్రితం పాఠశాల హెచ్‌ఎంకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు ఉపాధ్యాయురాలిని మరో పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించారు.అయినప్పటికి నాగేందర్, ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయురాలు భర్త కానిస్టేబుల్‌ ఈ నెల 18న శివరాత్రి బందోబస్తు డ్యూటీపై వేములవాడకు వెళ్లాడు.

యువతి పెళ్లికి ఒప్పుకోలేదని అంకుల్ దారుణం, జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకువచ్చి కత్తితో పొడుస్తూ అమానవీయ ప్రవర్తన, వీడియో సోషల్ మీడియాలో వైరల్, రంగంలోకి దిగిన పోలీసులు

సోమవారం సెలవు ఉండటంతో మంగపేటలో ఉంటున్న భార్య, కూతురును చూసేందుకు వచ్చాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నాగేందర్‌.. ఉపాధ్యాయురాలి సెల్‌కు ఫోన్‌చేయగా భర్త లిఫ్ట్‌ చేశాడు. ‘నేను వస్తున్నా తలుపు తీసి ఉంచు’అని నాగేందర్‌ చెప్పాడు. తన అనుమానం నిజమైందని భావించిన భర్త తలుపు తీసి బాత్‌రూంలో దాక్కున్నాడు. నాగేందర్‌ ఇంట్లోకి రాగానే గడియ పెట్టి ఇంతరాత్రి ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్న క్రమంలో పడుకుని ఉన్న తన భార్య, నాగేందర్‌ ఇద్దరు కలిసి అతనిపైనే దాడి చేసేందుకు యత్నించారు. దీంతో భయపడిన అతను ఇంటి గడియపెట్టి బయటకు వచ్చి ఇరుగుపొరుగుకు చెప్పాడు. ఉదయం తాళ్లతో ఇద్దరిని బంధించి పోలీసులకు అప్పగించారు.