Andhra Pradesh Road Accident: వీడియో ఇదిగో, కృష్ణా జిల్లాలో తెల్లవారుజామున లారీ, కంటైనర్‌ ఢీ, ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్‌ ఢీకొన్నాయి. లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు, కంటైనర్‌ పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తుండగా కర్రల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Six people were killed and several injured in a fatal road accident in Krishna district Video surfaces

Vjy, June 14:  కృష్ణా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్‌ ఢీకొన్నాయి. లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు, కంటైనర్‌ పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తుండగా కర్రల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలోఘటనాస్థలంలోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. దారుణం, ఇష్టం లేని పెళ్లి సంబంధం తెచ్చాడని తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన కూతురు, మదనపల్లిలో విషాదకర ఘటన

మృతులను కాకినాడ జిల్లా గొర్రిపూడి గ్రామానికి చెందిన గండి ధర్మవర ప్రసాద్ (27), అమలాపురానికి చెందిన పేసింగు కనకరాజు (34), కాట్రేనికోనకు చెందిన చింతా లోవరాజు (32), మాగపు సోమరాజు (30), ఎస్ యానాంకు చెందిన రేవు నాగభూషణం (26), తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ అయ్యప్పన్ (42)గా గుర్తించారు. ప్రమాద సమయంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణికులున్నారు. కంటైనర్‌లో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడున్నారు. చేపలు పట్టేందుకు వెళ్తూ వీరంతా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు.

Heres' Video

ఈ ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని మంత్రి ప్రకటించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif