Andhra Pradesh Shocker: పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని ఆత్మహత్య, కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన
జిల్లాలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పురిమెట్ల సాయిప్రసాద్ (25) ఆదివారం పని ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Kurnool, May 29: కర్నూలుజిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పురిమెట్ల సాయిప్రసాద్ (25) ఆదివారం పని ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటేశులు, సీతమ్మ కుమారుడైన సాయిప్రసాద్ బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు.
కొంతకాలంగా పనిఒత్తిడి భరించలేకపోతున్నానని, కంపెనీ మారాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పేవాడు. రెండు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లి.. తిరిగి వెంటనే స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.