Andhra Pradesh: ఈ నెల23న జీవో నెం 1పై హైకోర్టు విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచన, వాద, ప్రతివాదులిరువురూ డివిజన్‌ బెంచ్‌ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని స్పష్టం

దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జీవో నెం.1 పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

Amaravati, Jan 20: ఇటీవల తీసుకువచ్చిన జీవో నెం.1పై (GO 1 petition) ఏపీ హైకోర్టు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జీవో నెం.1 పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల23న జీవో నెం 1పై హైకోర్టు విచారణ జరపాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ విచారణ జరపాలని పేర్కొంది. వాద, ప్రతివాదులిరువురూ డివిజన్‌ బెంచ్‌ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 23న జీవో నంబర్‌ 1పై విచారణ (High Court to conduct hearing) చేపట్టాలని హైకోర్టుకు సూచించింది.

కాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1పై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలో దీనిపై శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.

చిరంజీవి మా పార్టీలోనే ఉన్నారు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.. ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు

రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విచారించే పరిధి వెకేషన్ బెంచ్‌కు లేదని కోర్టుకు తెలిపారు. తనకు లేని పరిధిలో వెకేషన్ బెంచ్ తీర్పు చెప్పిందని వాదించారు. ఉదయం 10:30కు కేసును మెన్షన్ చేసి.. ప్రతివాదుల వాదనలు వినకుండానే అదే రోజున తీర్పు వెల్లడించారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ వాదనను తన ఉత్తర్వులలో రికార్డు చేసిన సీజేఐ డీవై చంద్రచూడ్.. కేసు మెరిట్స్ లోపలికి వెళ్లడం లేదని తెలిపారు. హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని అన్నారు.

ఏపీ ప్రభుత్వ పిటిషన్‌లోని ముఖ్యమైన అంశాలు

►బహిరంగ సభలను నిషేధిస్తున్నట్లు జీవోలో ఎక్కడ ఒక పదం కూడా లేదు

►చంద్రబాబు సభల్లో 11 మంది చనిపోయారు, సభలను అడ్డగోలుగా నిర్వహించారు

►ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది

►సభలపై అవసరమైన మేరకు మాత్రమే నియంత్రణలు విధించాం

►జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులలో బహిరంగ సభలు పెట్టొద్దని కోరాం

►ప్రత్యామ్నాయ ప్రాంతాలలో స్థలాలలో సభలు పెట్టుకోవాలని కోరాం

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జీవో నెం.1పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని పేర్కొన్నారు. హైకోర్టులో విచారణ ఉండగా, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సైకో తరహా నిర్ణయాలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. జీవో నెం.1ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు, సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశాలు

రాష్ట్రంలో రోడ్లపై సభలు, సమావేశాలు, రోడ్ షోలకు సంబంధించిన అనుమతులపై ప్రభుత్వం జీవో నెం.1 తీసుకురాగా, ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా, జీవో నెం.1ను హైకోర్టు ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసింది. అదే రోజున హైకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. ఈలోపే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది.

జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైకోర్టులోనే కేసు విచారణ జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలను ఇబ్బంది పెట్టేందుకే జీవో నంబర్‌ 1ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఆ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.