Andhra Pradesh: కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు, సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో.. ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఐఏఎస్‌ బుడితి రాజశేఖర్‌, ఐఆర్‌ఎస్‌ రామకృష్ణకు నెల రోజుల జైలుశిక్షతో పాటు ₹2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు మొదట తీర్పు ఇచ్చింది.

Andhra Pradesh: కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు, సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశాలు
HIGH COURT OF ANDHRA PRADESH| (Photo-Twitter)

ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో.. ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఐఏఎస్‌ బుడితి రాజశేఖర్‌, ఐఆర్‌ఎస్‌ రామకృష్ణకు నెల రోజుల జైలుశిక్షతో పాటు ₹2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు మొదట తీర్పు ఇచ్చింది. వీరిద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

అయితే సదరు అధికారులు ఇద్దరు హైకోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పడంతో తీర్పును ధర్మాసనం సవరించింది. సాయంత్రం వరకు కోర్టులోనే నిలబడాలని ఆదేశించింది.గతంలో రాజశేఖర్‌.. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డు ముఖ్య కార్యదర్శిగా పనిచేయగా.. ఇంటర్‌ బోర్డు కమిషనర్‌గా రామకృష్ణ పనిచేశారు. ప్రస్తుతం రామకృష్ణ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో ఐజీగా ఉన్నారు.

Here's News Update

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 18, 2023 03:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).