Kondapalli Municipal Election: ఎంపీ కేశినేని నాని ఓటుతో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ, ఛైర్మన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నిక

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక (Kondapalli municipal chairman) ఎట్టకేలకు పూర్తయ్యింది. ఛైర్మన్‌గా టీడీపీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టిబాబును ఆ పార్టీ సభ్యులు బలపరిచారు. దీంతో ఆయన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా (TDP bags Kondapalli municipal chairman post )ఎన్నికయ్యారు.

Kesineni Srinivas (Photo-Twitter)

Amaravati, Nov 24: హైకోర్టు ఆదేశాలతో.. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక (Kondapalli municipal chairman) ఎట్టకేలకు పూర్తయ్యింది. ఛైర్మన్‌గా టీడీపీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టిబాబును ఆ పార్టీ సభ్యులు బలపరిచారు. దీంతో ఆయన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా (TDP bags Kondapalli municipal chairman post )ఎన్నికయ్యారు. ఎంపీ కేశినేని నాని ఓటుతో టీడీపీకి (TDP)మెజారిటీ వచ్చింది. వైస్ ఛైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, మరో వైస్ ఛైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మీకి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల అధికారులు ఇంకా ఫలితాలను ప్రకటించలేదు.

కొండపల్లి పురపాలక సంఘ ఎన్నికల్లో వైసీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా వసంత కృష్ణప్రసాద్‌ ఉన్నప్పటికీ వారి బలం 15కే పరిమితం అయింది. టీడీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, స్వతంత్ర సభ్యురాలి చేరికతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఎక్స్‌ అఫిషియోగా ఎంపీ కేశినేని నానీకి కోర్టు ఓటు హక్కును కల్పించడంతో టీడీపీ బలం 16కు పెరిగింది. దీంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడుతూ వచ్చి ఇవాళ్టితో ఫుల్‌స్టాప్ పడింది.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hyderabad: నార్సింగిలో సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను తొలగించిన అధికారులు, బీఆర్ఎస్ ఆనవాళ్లను చెరిపేసే కక్ష సాధింపు చర్య అని మండిపడిన బీఆర్ఎస్