Pension Distribution in AP: వీడియో ఇదిగో, లబ్దిదారు ఇంటికి వెళ్లి రూ. 7 వేలు ఫించన్ అందజేసిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించారు.

NTR Bharosa Pension (Photo-Video Grab)

Vjy, July 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు నగదును అందజేశారు.సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు.

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. మొత్తం 65.18 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్ల నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,20,097 మంది సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో పాల్గొంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం మొదటి నెలలోనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టినట్టు అయింది.  ఆంధ్రప్రదేశ్ రాజ‌ధానిపై శ‌ర‌వేగంగా ప్ర‌భుత్వం అడుగులు, ప్ర‌భుత్వ కాంప్లెక్స్ భ‌వ‌నాల‌ను గుర్తిస్తూ గెజిట్ విడుద‌ల‌

Here's Videos

తొలి రోజే 100 శాతం పంపిణీని పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ప్రణాళికలో భాగంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి 50 మంది లబ్దిదారులకు పింఛను అందజేసేలా బాధ్యతలు అప్పగించారు. అంతకంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సి వచ్చిన కొన్ని చోట్ల అంగన్‌వాడీ, ఆశా సిబ్బందిని అధికారులు వినియోగించుకోనున్నారు. ఇక తొలి రోజు అందుకోలేని వారికి రెండోరోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛను అందజేస్తారు.



సంబంధిత వార్తలు

Sunita Williams Health: సునితా విలియ‌మ్స్ ఆరోగ్యం డేంజ‌ర్ లో ఉందా? క‌ల‌వ‌ర‌పెడుతున్న తాజా ఫోటో, తీవ్ర అనారోగ్యంతో ఉన్నారంటున్న నిపుణులు

Maharashtra Assembly Elections 2024: మ‌హిళ‌లకు ఫ్రీ బ‌స్సు, ప్ర‌తి నెలా రూ. 3వేలు, కుటుంబానికి రూ. 25ల‌క్ష‌ల ఆరోగ్య బీమా..మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో మ‌హావికాస్ అఘాడీ గ్యారెంటీలివే!

Jogi Ramesh: నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి, జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదని మండిపాటు

Andhra Pradesh: వైసీపీ కార్యకర్తలు భయపడకండి, కేసులు పెడితే పూర్తి న్యాయ సహకారం అందిస్తామని తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి