Amarawati, June 29: ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ అయింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం వీటిని నిర్మిస్తారు. ఇందుకుగానూ, 1,575 ఎకరాల ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) నోటిఫై చేసింది. జోనింగ్ నిబంధనలకు అనుగుణంగా నోటిఫై చేస్తున్నట్లు చెప్పింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 39 కింద ఈ బహిరంగ ప్రకటన చేసింది. కాగా, శాఖమూరు, కొండమరాజుపాలెం, రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి రాజధాని పనులను మళ్లీ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
AP CM Chandrababu: జులై 1 నుంచి లబ్దిదారుల ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తాం- సీఎం చంద్రబాబు
పదేళ్ల క్రితం తాను రూపొందించిన నగరానికి ఇప్పుడు తనచేత్తోనే తిరిగి ప్రాణం పోసేందుకు సీఎం చంద్రబాబు (Chandra Babu) సిద్ధమయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరంలో చేసిన చంద్రబాబు… రెండో పర్యటనకు అమరావతిని ఎంచుకున్న విషయం తెలిసిందే. అమరావతిని ఏపీ రాజధానిగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన ఎన్నికల హామీని అమలుచేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు ప్రారంభించారు. రాజధాని తొలి దశ నిర్మాణానికి రెండున్నరేళ్లను డెడ్‌లైన్‌గా పెట్టుకుంది టీడీపీ ప్రభుత్వం.