Three Capital Row: రాజధాని అంశం అసలు మా పరిధిలో లేనే లేదు, హైకోర్టు నోటీసులపై మరోసారి స్పందించిన కేంద్రం, మూడు రాజధానుల అంశం మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లోని 3 రాజధానులపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాజధాని అంశం (Three Capital Row) మా పరిధిలో లేదంటూ తేల్చేసింది. రాజధానుల్ని నిర్ణయించుకునే హక్కు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అంటూ పేర్కొంది. ఇదే విషయాన్ని గతంలోనే ఏపీ హైకోర్టుకు తెలియజేసింది. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై ఏపీ హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.

AP Three Capital (Photo-File Photo)

Amaravati, August 19: రాజధాని విషయంలో హైకోర్టు (AP High Court) ఇచ్చిన నోటీసులపై మరోసారి కేంద్రం స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 3 రాజధానులపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాజధాని అంశం (Three Capital Row) మా పరిధిలో లేదంటూ తేల్చేసింది. రాజధానుల్ని నిర్ణయించుకునే హక్కు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అంటూ పేర్కొంది. ఇదే విషయాన్ని గతంలోనే ఏపీ హైకోర్టుకు తెలియజేసింది. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై ఏపీ హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే ఏపీకి సంబంధించిన మూడు రాజధానుల అంశం మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు (Supreme court) బుధవారం స్పష్టం చేసింది. ఈ కేసును సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కాగా ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం జస్టిస్‌ నారీమన్‌ ( justice nariman) బెంచ్‌కు మూడు రాజధానుల కేసును బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో (andhra pradesh three capital bill) రైతుల త‌రుపున నారిమన్‌ తండ్రి పాలి నారిమన్‌ వాదిస్తుండ‌టంతో ఆయన‌ విచారణ నుంచి తప్పుకున్నారు. కేబినెట్ భేటీలో ఏపీ సీఎం పలు కీలక నిర్ణయాలు, వైఎస్సార్ ఆసరా పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం, డిసెంబర్ ఒకటి నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం

ఈ కేసుకు సంబంధించి విచారణను వేరే బెంచ్‌కు మార్చాల‌ని జ‌స్టిస్ నారిమ‌న్ ఆదేశించారు. దీంతో ఈ కేసు వేరే బెంచ్ కు బదిలీ కానుంది. ఈ నేపథ్యంలో విచారణను మరోసారి వాయిదా వేశారు. కాగా పాలనావికేంద్రీకరణ, రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల వల్ల అమరావతికి భూములిచ్చిన రైతుల ప్రాథమిక హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ చట్టాల్లో రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించామని పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఏ చట్టాన్నైనా రద్దు చేసే అధికారం రాష్ట్రానికి ఉందని నివేదించింది.ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు, తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా

మాస్టర్‌ ప్లాన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చునని, దాని ఆధారంగా మాట్లాడటం సరికాదంది. గత నిర్ణయాన్ని పునఃసమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణమని చెప్పింది. తాము ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏకపక్ష నిర్ణయం కాదని, పలు సంస్థలు జరిపిన అధ్యయనాల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు నివేదించింది.



సంబంధిత వార్తలు