AP Chief Minister Y.S. Jagan Mohan Reddy (photo-Twitter)

Amaravati, August 19: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్‌ సమావేశం (AP Cabinet Meeting) ముగిసింది. ఈ కేబినెట్‌ బేటీలో సీఎం జగన్‌ పలు కీలక నిర్ణయాలు ( key decisions) తీసుకున్నారు. ఈ సందర్భంగా వైస్సార్‌ ఆసరా పథకానికి (YSR Arogya Asara Scheme) ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నవరత్నాల్లో భాగంగా మరో హామీ అమలు చేసే దిశగానే వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా 9 లక్షల 33 వేల డ్వాక్రా గ్రూపులకు లబ్ధి చేకూరనుంది. మొదటి ఏడాది రూ.6,792 కోట్ల లబ్ధి లభించనుంది. మొత్తంగా నాలుగేళ్లలో 27 వేల 168 కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది. డ్వాక్రా గ్రూపులను ఆర్థికంగా పరిపుష్టి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

జగనన్న విద్యాకానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్ల పంపిణీ చేయనుంది. 42 లక్షల 32 వేల మందికి వచ్చే నెల 5న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే గర్భిణీలు, బాలింతలు, పిల్లల కోసం వచ్చే నెల 1న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి శ్రీకారం చుట్టనుంది. వీటితో పాటు డిసెంబర్ ఒకటి నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 9260 వాహనాల ద్వారా ఇంటివద్దనే తూకం వేసి బియ్యం పంపిణీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువకులకు వాహనాలు సబ్సిడీపై అందజేయనుంది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు, తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా

అలాగే 583 కోట్లతో బియ్యం కార్డుదారులకు వైఎస్సార్ భీమా పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త పారిశ్రామిక విధానానికి కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఏపీ బల్క్ డ్రగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ చట్టంలో సవరణలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది

కేబినెట్‌ బేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్‌ 1న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం, సెప్టెంబర్‌ 5న వైఎస్సార్ విద్యాకానుక పథకం, సెప్టెంబర్‌ 11న వైఎస్సార్ ఆసరా పథకాలకు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో పాటు పంచాయతీరాజ్‌ శాఖలో 51 డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల పోస్టులకు కూడా కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.