TTD Budget 2020-21: టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.3309 కోట్లు, గతేడాది కంటే రూ.66 కోట్లు అధికం, ఆమోదం తెలిపిన పాలక మండలి
ఈ ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు తిరుమలలోని (Tirumala) అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సమావేశంలో పలు అభివృద్ధి పనులు, ఆలయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. బడ్జెట్‌లో ముఖ్యంగా హిందూ ధర్మప్రచారం, భక్తుల సౌకర్యాలు, దేవాలయ నిర్మాణాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతలకు ప్రాధాన్యం ఇచ్చారు.
Amaravathi, Mar 01: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) 2020-21 బడ్జెట్ కు (TTD Budget 2020-21) ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు తిరుమలలోని (Tirumala) అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు
సమావేశంలో పలు అభివృద్ధి పనులు, ఆలయ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. బడ్జెట్‌లో ముఖ్యంగా హిందూ ధర్మప్రచారం, భక్తుల సౌకర్యాలు, దేవాలయ నిర్మాణాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతలకు ప్రాధాన్యం ఇచ్చారు.
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది బడ్జెట్ రూ.66 కోట్లకు పైగా పెరిగింది. హుండీ ద్వారా 1351 కోట్లు, లడ్డూ విక్రయాల ద్వారా 400 కోట్లు, వడ్డీల ద్వారా 706 కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ పాలక మండలి అంచనా వేసింది. బూందీపోటులో అగ్ని ప్రమాదాల నివారణకు 3కోట్ల 30లక్షల్లతో థర్మో ఫ్లూయిడ్ స్టవ్ ల ఏర్పాటు, జూపార్క్ దగ్గర 14 కోట్ల రూపాయలతో ప్రతిభా వంతుల శిక్షణా సంస్థ వసతి గృహం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ టీటీడీ టెంపుల్ దగ్గర పుష్కరిణి, కల్యాణ మండపం, వాహన మండప నిర్మాణానికి ఆమోదం తెలిపింది. చెన్నైలో పద్మావతి ఆలయ నిర్మాణానికి 3.3 కోట్లు, బర్డ్ ఆస్పత్రిలో అభివృద్ధి పనులకు 8.5 కోట్లు కేటాయించింది.
టీటీడీ నిఘా, భద్రతా విభాగంలో ఖాళీగా ఉన్న 300 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. అలిపిరి చెక్‌పాయింట్ వద్ద టోల్‌గేట్‌లో జాతీయ రహదారుల సంస్థ నిర్దేశించిన మేరకు వాహనాల విభజన చేపట్టి ఫాస్టాగ్ అమలు చేయాలని, టోలు రుసుం పెంచాలని నిర్ణయం. ద్విచక్ర వాహనాలకు టోలు రుసుం మినహాయింపు. ఇన్ఫోసిస్ సహకారంతో టీటీడీలో సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేకాధికారిని నియమించాలని నిర్ణయం.జమ్మూ, వారణాసి, ముంబైలలో త్వరలో శ్రీవారి ఆలయాల నిర్మాణం వంటి వాటికి పాలకమండలి ఆమోదం తెలిపింది.
ఈ కార్యక్రమంలో.. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి ఎక్స్ అఫీషియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, శ్రీ శార్వరి నామ సంవత్సర తెలుగు పంచాంగం శనివారం నుంచి తిరుమల, తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంది. మార్చి మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీటీడీ కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది.