125 Feet Ambedkar Statue: ఏపీలో 125 అడుగుల బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం, విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో విగ్రహం ఏర్పాటు, ఈ నెల 8న ప్రారంభించనున్న ఏపీ సీఎం
ఈనెల 8న సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విగ్రహం శంకుస్థాపన పనులు ప్రారంభిస్తారని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సోమవారం పరిశీలించారు.
Amaravati, July 7: ఏపీ రాష్ట్రంలో విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్)లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని (125 Feet Ambedkar Statue) ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh government) ఏర్పాటు చేయనుంది. ఈనెల 8న సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విగ్రహం శంకుస్థాపన పనులు ప్రారంభిస్తారని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సోమవారం పరిశీలించారు. అక్కాచెల్లెమ్మలకు ఆస్తిని ఇద్దామంటే టీడీపీ అడ్డుపడుతోంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, స్పందన సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్
ఈ పరిశీలన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శంకుస్థాపనలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, మెమోరియల్ హాలు, మెమోరియల్ లైబ్రరీ, స్టడీ సెంటర్, ల్యాండ్ స్కేపింగ్, గార్డెన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జాయింట్ కలెక్టర్ డా. కె.మాధవీలత, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్, జేసీ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్, సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఏప్రిల్ 14న అంబేడ్కర్ జన్మదినం (Dr BR Ambedkar's birth anniversary) కావడంతో 2021 ఏప్రిల్ 14 కల్లా ఈ విగ్రహాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ విగ్రహం ద్వారా పర్యాటకంగా రాష్ట్రం ముందంజలో దూసుకుపోయే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే గత ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, దానిపై పనులు ఇంకా ప్రారంభం కాలేదు.