AP Weather Update: ఏపీలో మొదలైన వానలు, రానున్న రెండు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బంగాళాఖాతంలో కలిసిపోయి కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాలు
ఈ ద్రోణితో రెండు ఉపరితల ఆవర్తనాలు కలిసిపోయి కొనసాగుతున్నాయని వివరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు ఐఎండీ తెలిపింది.
ఈ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిథిలి తుఫాను బంగ్లాదేశ్ వద్ద తీరం దాటిన విషయం మనకి తెలిసిందే. ఇది క్రమంగా బలహీనపడి.. వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం పొడి వాతావరణం నెలకొంది. ఎండ తీవ్రత కూడా అమాంతం పెరిగింది.అయితే, ఆగ్నేయ బంగాళాఖాతం.. దానికి ఆనుకుని అండమాన్ సముద్రం.. ఇంకా శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
కొమోరిన్ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఈ ద్రోణితో రెండు ఉపరితల ఆవర్తనాలు కలిసిపోయి కొనసాగుతున్నాయని వివరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు ఐఎండీ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైందని తెలిపింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా తిరుపతి జిల్లా గూడూరులో 9 సెంటీమీటర్లు, సూళ్లూరుపేటలో 7 సెంమీ, నెల్లూరు నగరంలో 9 సెంమీ వర్షపాతం నమోదైనట్టు వివరించింది. నేడు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో మూడు రోజులు వర్షాలే.. వాతావరణ శాఖ అలర్ట్
దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. నేడు కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని సూచించింది. నవంబరు 20 నుంచి తూర్పుగాలులు బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న దక్షిణ కోస్తా, 23 నుంచి 23 వరకు కోస్తాలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
తూర్పు గాలులలో సగటు సముద్ర మట్టం వద్ద నుంచి ఏర్పడిన ద్రోణి శ్రీలంక నుంచి నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు. ఒకటి రెండు చోట్ల అయితే భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు.
ఈ నెల 22 న తేలికపాటి నుంచి మోస్తరు.. లేని పక్షంలో ఉరములతో కూడిన జల్లులు కురుస్తాయంటున్నారు. దక్షిణ కోస్తాలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు.. ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం ఉందంటున్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు కురవచ్చని అంచనా వేస్తున్నారు. నేడు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటోంది వాతావరణశాఖ.