Andhra Pradesh Weather Update: ఏపీలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిక

ఇక, రానున్న రెండు రోజుల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అనంతరం, మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కానున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది.

Rains (Photo-Twitter)

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇక, రానున్న రెండు రోజుల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అనంతరం, మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కానున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా.. పశ్చిమ విదర్భ, పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. మండే ఎండల్లో ఏపీ వాసులకు ఐఎండీ చల్లని కబురు, వచ్చే నాలుగు రోజులు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే అవకాశం

ఝార్ఖండ్‌ నుంచి ఒడిశా మీదుగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో బుధవారం అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి’ అని పేర్కొన్నారు.  తెలంగాణకు ఎల్లో అలర్ట్, వచ్చే నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద మీడియాతో మాట్లాడుతూ.. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుంది. అక్కడక్కడా చెదురుమొదురు వర్షాలు కురుస్తూ.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కోస్తా ప్రాంతంలో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఈ రెండు రోజుల తర్వాత మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. వర్షాలు పడే ప్రాంతాల్లో గాలుల వేగం కూడా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు.

మరోవైపు.. తెలంగాణలో ఇప్పటికే పలు భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కూడా మంగళవారం పలుచోట్ల వర్షం కురిసింది. రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif