Andhra Pradesh: అత్త తిట్లు భరించలేక కోడలు ఆత్మహత్యాయత్నం, కేసు నమోదు చేసిన అనంతపురం జిల్లా పోలీసులు, ఇక చీరాలలో ఇంట్లోకి రానివ్వడం లేదని అత్తింటి ముందు ధర్నాకు దిగిన కోడలు
అత్త తిట్లు భరించలేక ఓ కోడలు (woman attempt suicide in Anantapur) నిప్పంటించుకుంది.
Anantapur, Nov 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అత్త తిట్లు భరించలేక ఓ కోడలు (woman attempt suicide in Anantapur) నిప్పంటించుకుంది. అనంతపురం పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలోని మున్నానగర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి పోతులయ్య, బోయ లక్ష్మి దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు సంతానం. అయితే ఈ నెల 6న సాయంత్రం అత్తాకోడలి మధ్య వాగ్వాదం జరిగింది. తనను పట్టించుకోవడం లేదని, అన్నం సక్రమంగా పెట్టడం లేదంటూ కొడుకు పోతులయ్యతో ఈశ్వరమ్మ చెప్పి కోడలిని (Aunt Harrsment ) దూషించింది.
సాధారన గొడవేనని కాసేపటికే పోతులయ్య బయటకు వెళ్లిపోయాడు. ఇంట్లో అత్త, పిల్లలు మాత్రమే ఉన్నారు. వారి ముందే కోడలు లక్ష్మి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈశ్వరమ్మ అరుపులతో చుట్టుపక్కల వారు చేరుకుని మంటలార్పారు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ గౌస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరుగుతున్న నూనెలో చేయి పెట్టి చికెన్ తీస్తున్న చెఫ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే
మరో జిల్లా ప్రకాశంలోని చీరాలలో కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో కాన్పుకు పుట్టింటికి వెళ్లి తిరిగి పసిబిడ్డతో ఇంటికి వచ్చిన కోడల్ని ఇంటిలోకి రానివ్వక పోవడంతో ఆ యువతి అత్తింటి ముందు బైఠాయించింది. ఈ ఘటన ఆదివారం వేటపాలం మండలం కొత్తపేట పంచాయతీ టైలర్స్ కాలనీలో జరిగిది. ఘటన వివరాల్లో వెళితే.. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ టైలర్స్‌కాలనీకి చెందిన గుంటి దీపు, ఇంకొల్లుకు చెందిన రోజాలు కులాంతర వివాహం చేసుకున్నారు.
వివాహం చేసుకున్న రోజు నుంచి అత్తమామలు వేధిస్తున్నారనని ఆమె ఆరోపిస్తుంది. కాన్పుకు వెళ్లి ఏడు నెలల పసిబిడ్డతో ఆదివారం ఇంటికి రాగా ఇంటిలోకి రానివ్వలేదని ఆమె వాపోయింది. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్సై రత్నకుమారి సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యువతిని ఇంటిలోకి పంపించారు. పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది.