Andhra Pradesh Shocker: విశాఖలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య, డాక్టరైన భర్త కట్నం వేధింపులే కారణం, కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు
గిరిప్రసాద్‌కు 6లక్షల నగదు, 13 తులా ల బంగారం ఇచ్చారు. అయినా తరచూ డబ్బులు తీసుకురావాలని సౌజన్యతో గిరిప్రసాద్ గొడవపడేవాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. శనివారం సాయంత్రం గిరిప్రసాద్ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి సౌజన్య ఉరివేసుకుని (Woman software employee commits suicide) ఉంది.
Visakha, Jan 30: విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య (Andhra Pradesh Shocker) చేసుకుంది. ఈ సంఘటన విశాఖలోని పెందుర్తి మండలం దువ్వుపాలెంలో చోటుచేసుకుంది. పెందుర్తి సీఐ అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సౌజన్య(26)కి, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన హనుమంతు గిరిప్రసాద్‌తో 8 నెలల కిందట వివాహం జరిగింది. మూడు నెలల కిందట వీరు దువ్వుపాలెంలో ఇళ్లు కొనుగోలు చేసి నివసిస్తున్నారు.
గిరిప్రసాద్ విశాఖ నగరంలోని ఓ ఆస్పత్రిలో దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు. సౌజన్య అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోం ద్వారా విధులు నిర్వర్తిస్తోంది. వీరి వివాహం సమయంలో సౌజన్య తండ్రి విష్ణు.. గిరిప్రసాద్‌కు 6లక్షల నగదు, 13 తులా ల బంగారం ఇచ్చారు. అయినా తరచూ డబ్బులు తీసుకురావాలని సౌజన్యతో గిరిప్రసాద్ గొడవపడేవాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు.
శనివారం సాయంత్రం గిరిప్రసాద్ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి సౌజన్య ఉరివేసుకుని (Woman software employee commits suicide) ఉంది. ఈ విషయాన్ని సౌజన్య తల్లిదండ్రులకు తెలిపాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేసి సీఐ అప్పారావు, ఎస్‌ఐ సురేష్ దర్యాప్తు చేస్తున్నారు.