Hyd, Jan 30: నిజామాబాద్‌లో విషాదకర ఘటన చోటు (Nizamabad Shocker) చేసుకుంది. పిల్లనిచ్చిన మామ వేధింపులు భరించలేక అల్లుడు గోదావరిలో దూకి ( son-in-law jumped into the Godavari) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చోటుచేసుకుంది.హైదరాబాద్ ఉప్పుగూడకు చెందిన అర్దం సందీప్‌కుమార్ (31)కు నవీపేట మండలం బినోలా గ్రామానికి చెందిన ప్రియతో రెండున్నరేండ్ల క్రితం వివాహమైంది.
విస్తరాకులు, బ్రెడ్ల వ్యాపారం నిర్వహిస్తున్న సందీప్‌కుమార్‌కు మామ ఓ ఫైనాన్స్‌లో రూ. 5 లక్షలు ఇప్పించాడు. మొదట్లో ఈఎంఐలు సక్రమంగా చెల్లించిన సందీప్‌కుమార్ వ్యాపారం సరిగ్గా నడకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నెల 26న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన మరదలు పెండ్లికి తన భార్య ప్రియతో కలిసి సందీప్‌కుమార్ హాజరయ్యాడు.ఈ క్రమంలో అల్లుడు సందీప్‌కుమార్‌ను ఆ అప్పులు తీర్చాలంటూ బంధువుల సమక్షంలో (scolded by the uncle) మామ నిలదీశాడు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సందీప్‌కుమార్ ఈ నెల 27న ఇంటి నుంచి స్కూటీపై వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి యంచ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ సర్పంచ్ లహరి పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని బయటికి తీసి పంచనామా చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు సందీప్‌కుమార్‌కు భార్య ప్రియ, సన్విత్(2) ఉన్నారు. మృతుడి తండ్రి అర్దం మనోహర్ ఫిర్యాదు మేరకు మామ దేవేందర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు.