CM Jagan Clarity on Early Elections: ఏపీలో ముందస్తు ఛాన్సే లేదు, క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్, షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫుల్‌స్టాప్ పెట్టారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్ మీడియాతో పాటు యెల్లో బ్యాచ్ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
Amaravati, April 3: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫుల్‌స్టాప్ పెట్టారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్ మీడియాతో పాటు యెల్లో బ్యాచ్ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
సోమవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు పాల్గొన్న సమావేశంలో సీఎం జగన్.. తాజా రాజకీయ ప్రచారాలపై మాట్లాడారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన సీఎం జగన్.. మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయన్న ఆయన.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్, పార్టీ శ్రేణులతో చర్చించారు.
సమావేశంలో సీఎం జగన్ చెప్పిన హైలెట్స్ పాయింట్స్
ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం
దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చింది
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్యాప్ వచ్చింది
మార్చి 16వరకూ కోడ్ కొనసాగింది
తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి
తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి
దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్ వచ్చిందిమళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాల
గేర్ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలి
రాష్ట్ర చరిత్రే కాదు… దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్కౌంట్లో పడింది
అర్బన్ ప్రాంతంలో 84శాతం, రూరల్ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం
ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు
87శాతం కుటుంబాలను గమనించినట్టైతే… అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం
పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్ చేసిన మరీ… వారికి పథకాలు అందిస్తున్నాం
గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం:
బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ… గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు. ఇచ్చాం
ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం
ఈ మధ్యకాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫, చంద్రబాబును చూసినా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు
21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచాం
మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం
ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు
కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి:
ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి
ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు
అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది
ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి
అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు
వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు చాలా శాతం మంది డీబీటీలో లేనివారు
కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు
ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది
రాష్ట్రంలో ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపిల్ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు
ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యం… మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి
మిగిలిన పార్టీ అందరూ కలిశారు.. మనం ఒక్కరిమే
అయినప్పటికీ కూడా… తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు
ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి.. జరిగింది
అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు
దానికితోడు ఈనాడు రాయడం, ఆంధ్రజ్యోతి రాయడం, టీవీ-౫ చూపడం
రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు
60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారుచేస్తున్నారని చెప్తారు
ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు
ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు
ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారు
రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి
అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం
వారంతా గజ దొంగల ముఠా
దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది
అందుకే గజదొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి
రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి
వాటిని తిప్పికొట్టాలి
సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం
కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి
సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి
సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి
గృహసారథులను, సచివాలయ కన్వీనర్లు.. వ్యవస్థను పూర్తిచేసుకోవాలి
ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారుచేసుకోవాలి
వాలంటీర్లను, గృహసారథులను మమేకం చేయాలి
వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వంచేస్తున్నమంచిని ప్రతికుటుంబానికీ తీసుకెళ్లాలి
దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశాం
ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలి
నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి
నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి
సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారంచుడదాం
ఒకవైపున గడపగడపకూ జరుగుతుంది… రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయి
వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నాం
రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు
ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను
ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను
మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే.. ఈ కార్యక్రమాలు
ఈ అడుగులన్నీ కూడా దానికోసమే
కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నాకు
ప్రతి నియోజకవర్గంలో లక్షలమంది మనపై ఆధారపడి ఉన్నారు
ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం
మన అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు
అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి
ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి
అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి
ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది
నేను చేయాల్సింది.. నేను చేయాలి
మీరు చేయాల్సిది మీరు చేయాలి
ఈరెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే… అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)