YS Vijayamma: ఒక్కసారిగా పేలిపోయిన రెండు కారు టైర్లు, ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ వైఎస్ విజయమ్మ

కర్నూలు నగర శివారులోని జాతీయ రహదారిపై వైఎస్ విజయమ్మకు (Ys Vijayamma) ఘోర ప్రమాదం తప్పింది ఓ పంక్షన్ లో పాల్గొనేందుకు ఆమె కర్నూలు వెళ్లారు.కార్యక్రమానికి హాజైర తిరిగి వస్తుండగా నగరంలోని గుత్తి రోడ్డులు ఆమె ప్రయాణిస్తున్న రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.

YS Vijayamma

Kurnool, August 11: కర్నూలు నగర శివారులోని జాతీయ రహదారిపై వైఎస్ విజయమ్మకు (Ys Vijayamma) ఘోర ప్రమాదం తప్పింది ఓ పంక్షన్ లో పాల్గొనేందుకు ఆమె కర్నూలు వెళ్లారు.కార్యక్రమానికి హాజైర తిరిగి వస్తుండగా నగరంలోని గుత్తి రోడ్డులు ఆమె ప్రయాణిస్తున్న రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. రెండు టైర్లు ఒకేసారి పంచర్‌కావడంతో ఆమె ప్రయాణిస్తున్న కారు (Car) రోడ్డుపై నిలిచిపోయింది. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు.అనంతపురం వివాహ కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ (Hyderabad) తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది.  ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ఆకాంక్ష, కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరినీ చదివించండి, బాపట్లలో విద్యా దీవెన మూడో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్

కారు రిపేర్ అయ్యే వరకు పోలీస్ బెటాలియన్ గెస్ట్ హౌస్‌ (Police Battalian Guest House)లో విజయమ్మ ఉన్నారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న నాటి మిత్రుడు అయ్యపురెడ్డి (Ayyapureddy) ఇంటికి వెళ్లి పరామర్శించారు. అంతకుముందు కారు రిపేరు సమాచారం అందుకున్న కర్నూలు 4వ పట్టణ పోలీసులు దగ్గర ఉండి విజయమ్మ కారును పంపించారు.