YCP MLAs Press Meet in Eluru: ప్రతి ఎన్నికలకూ కొత్త ముసుగుతో చంద్రబాబు, మండిపడిన ఏలూరు జిల్లా వైసీసీ ఎమ్మెల్యేలు, మూడున్నరేళ్లలో జగన్ ఏం చేశారో తెలుసుకోవాలని హితవు

చంద్రబాబు ప్ర‌తి ఎన్నిక‌ల‌కు కొత్త ముసుగుతో వ‌స్తారని, ఈసారి చంద్రబాబును ప్ర‌జ‌లే తిప్పి కొట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఏలూరులో గురువారం మీడియాతో మాట్లాడిన వారు చంద్రబాబు తన హయాంలో ఏలూరును అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.

YSRCP Eluru District MLAs (Photo/APCMO)

Eluru, Feb 23: చంద్రబాబు ప్ర‌తి ఎన్నిక‌ల‌కు కొత్త ముసుగుతో వ‌స్తారని, ఈసారి చంద్రబాబును ప్ర‌జ‌లే తిప్పి కొట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఏలూరులో గురువారం మీడియాతో మాట్లాడిన వారు చంద్రబాబు తన హయాంలో ఏలూరును అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. పేద, వెనుకబడిన తరగతులకు లబ్ధి చేకూర్చి రాష్ట్రం అభివృద్ధి చెందడాన్ని చంద్రబాబు చూడలేకపోతున్నారని, అందుకే దీన్ని పక్కదారి పట్టించేందుకే గన్నవరంలో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

గన్నవరం హింస దారి మళ్లించే వ్యూహం: చింతలపూడి ఎమ్మెల్యే వి.ఆర్.ఎలీజా

రెండు రోజుల ముందు వైఎస్సార్‌సీపీ 18 ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సింహభాగం సీట్లు ప్రకటించిందని, ప్రజల్లో ఆ విషయం చేరకుండా దృష్టి మళ్లించేందుకే గన్నవరం హింసను ప్రేరేపించారని చింతలపూడి ఎమ్మెల్యే వి.ఆర్. ఎలీజా ఆరోపించారు. చంద్రబాబు 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడూ సామాజిక న్యాయం చేయలేదన్నారు.

కొత్త గవర్నర్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం జగన్, ఫిబ్రవరి 24వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌‌

అందుకే ఇలాంటి హింసను ప్రేరేపించి వైసీపీ చేసిన సానుకూల పనిని దారి మళ్లించాలనుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, అతడి కుమారుడి ర్యాలీలకు ప్రజల నుంచి స్పందన రాకపోగా, వచ్చిన వారు మృత్యువాత పడుతుండటంతో ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారన్నారు. సొంత పార్టీ క్యాడర్ కూడా హాజరుకాని లోకేష్ పాదయాత్రతో విసుగు చెందిన చంద్రబాబు ప్రజల దృష్టి మరల్చడం కోసం అల్లర్లకు దిగారని విమర్శించారు.

ఐటి పరిశ్రమలకు వైజాగ్ గమ్యస్థానం: దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

అనంతరం దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఏం చేస్తుందో ప్రజలకు చెప్పగలరా అని ప్రశ్నించారు. బాబు 40 ఏళ్ల రాజకీయంలో ప్రజలకు ఏమీ ఎందుకు చేయలేకపోయారో స్పష్టం చేయాలని ఆయన సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని, డీబీటీ, సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిని రూపుమాపింది వైఎస్సార్‌సీపీ అని వివరించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సన్‌సద్‌ రత్న అవార్డు, 2023 ఏడాదిగానూ సన్‌సద్‌ రత్న అవార్డు విజేతల లిస్ట్‌ను ప్రకటించిన కేంద్రం

చంద్రబాబు హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ గత 3 ఏళ్లలో రూ. 46,000 కోట్ల పెట్టుబడులతో 100కు పైగా పెద్ద పరిశ్రమలను ఏపీలో నెలకొల్పేలా చేసిందని, ఇన్ఫోసిస్, హెచ్‌పీసీఎల్, టెక్నోటాస్క్, ఐజెన్, అమెరికన్ సాఫ్ట్‌వేర్‌లతో సహా ఐటీ కంపెనీలు, టెక్‌బుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్‌తో పాటు విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని టైర్-II నగరాల్లో తమ బ్రాంచులను ఏర్పాటు చేశాయని వివరించారు. గత మూడేళ్లలో రూ. 14,656 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో దాదాపు 1,06,249 ఎంఎస్ఎంఈ యూనిట్లు, 1,09,742 కోట్లతో 35,181 తయారీ యూనిట్లతో పాటు రూ. 4,914 కోట్లతో 71,068 సర్వీస్ యూనిట్లు స్థాపితమయ్యాయన్నారు.

అభివృద్ధి, పరిశ్రమలపై నారా లోకేష్‌తో చర్చకు తాను సిద్ధమన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. విశాఖ కేంద్రంగా తెలుగు ప్రజల బలాన్ని ప్రదర్శించబోతున్నామన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నామని అబ్బయ్య చెప్పారు. 3, 4 తేదీల్లో వైజాగ్‌లో జరిగే సదస్సులో పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రతినిధులు పాల్గొంటున్నారని, నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో మార్చి 5న టీడీపీకి సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.

టీడీపీలో బీసీలకు అవమానం:మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకట రమణ

తనను ఎమ్మెల్సీగా ప్రతిపాదించినందుకు సీఎం జగన్‌కు మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకట రమణ కృతజ్ఞతలు తెలిపారు. 22 ఏళ్లుగా టీడీపీలో ఉండి, రక్తమంతా టీడీపీకి ధారపోస్తే అక్కడ దక్కింది శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం జగన్ తనను నమ్మి వెంటనే ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయించారన్నారు. 2009లో కైకలూరులో భారీ పోటీ ఉన్నా గెలిచానని, 2014లో చంద్రబాబు తాను నామినేషన్‌ ఉపసంహరించుకునేలా చేశారని వివరించారు. ఇలాంటి మోసగాడిని జీవితంలో చూడలేదని, రాష్ట్రంలోని బీసీలందరినీ మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

టీడీపీ హయాంలో కొల్లేరు, కైకలూరుల్లో పనులన్నీ పెండింగే: కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కొల్లేరు ప్రజలను చంద్రబాబు మోసం చేశారని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు కొత్త ముసుగుతో వస్తున్నారని, ఈసారి ఆయనకు ప్రజాగ్రహం తప్పదని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సీఎం జగన్ హామీ మేరకు కొల్లేరులో రీసర్వే నిర్వహించి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇది చంద్రబాబు హయాంలో ఏనాడూ లేవని వివరించారు. బీసీల అభివృద్ధిని చూసి చంద్రబాబు అసూయ ప‌డుతున్నారన్నారు. తండ్రీకొడుకుల యాత్రలో తమ పాలనలో ఏ పనులు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

40 ఏళ్లలో బాబు చేయలేనిది కేవలం మూడున్నరేళ్లలో చేశాం: ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు

అభివృద్ధి అంటే ఎంత ఆదర్శప్రాయమో 'నాడు-నేడు'ను చూస్తే అర్థమవుతుందని, విద్యావ్యవస్థ కోసం రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్సీపీ ఏం చేశాయో నిరూపించడానికి ఇదొక్కటే చాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో ధనికులు వర్సెస్ పేదలు ఉంటారని స్పష్టం చేశారు. ‘‘ఏపీ విద్యా రంగంలో తెచ్చినన్ని సంస్కరణలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ తీసుకురాలేదన్నారు.

టీడీపీ వల్ల ప్రైవేటు సంస్థలే లబ్ధి పొందాయని, మధ్యతరగతి వారిని దోచుకున్నారని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లీష్‌తో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి జరిగిందని బాబుకు తెలుసన్నారు. ఈ విషయంలో వైఎస్‌ఆర్‌సీపీతో పోటీ పడలేకే అల్లర్లను రెచ్చగొట్టారని వివరించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now