Pinnelli Ramakrishna Reddy Arrest: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు.
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశముంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
అంతకుముందు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు కేసులలో ఆయన ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. కానీ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లనూ తిరస్కరించింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్, జూన్ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఏపీ హైకోర్టు ఆదేశాలు
ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి ఈవీఎంను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఓ మహిళను దుర్భాషలాడారు. పోలింగ్ మరుసటిరోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సీఐపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నింటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసంపై ఈసీ సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు, వైరల్ వీడియోపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు. జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా... నేడు తీర్పు వెలువరించింది. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్‌గా న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.