Visakhapatnam Crane Collapsed: రూ. 50 లక్షల నష్టపరిహారం, శాశ్వత ఉద్యోగం, రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఎల్‌ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం, క్రేన్‌ ప్రమాదంపై కేసు నమోదు, దర్యాప్తు

వీరి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఎల్‌ యాజమాన్యంతో ఆదివారం జరిపిన చర్చలు ఫలించాయి. క్రేన్‌ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం (Rs 50 lakh ex-gratia) మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, హెచ్‌ఎస్ఎల్‌ సీఎండీ శరత్‌బాబు సంయుక్తంగా ప్రకటించారు.

Visakhapatnam Crane Crash | (Photo Twitter)

Visakhapatnam, August 3: విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డులో (Hindustan Shipyard Ltd) శనివారం క్రేన్‌ కూలిన దుర్ఘటనలో (Visakhapatnam Crane Collapsed) 10 మంది ఉద్యోగులు, కార్మికులు మృతిచెందిన విషయం విదితమే. వీరి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఎల్‌ యాజమాన్యంతో ఆదివారం జరిపిన చర్చలు ఫలించాయి. క్రేన్‌ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం (Rs 50 lakh ex-gratia) మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, హెచ్‌ఎస్ఎల్‌ సీఎండీ శరత్‌బాబు సంయుక్తంగా ప్రకటించారు. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం, భారీ క్రేన్ కూలి 10 మంది దుర్మరణం, అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్ జగన్

ఆదివారం ఉదయం షిప్‌యార్డులో మృతుల కుటుంబాలు, యూనియన్‌ నాయకులు, సంస్థ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ... మృతుల్లో షిష్‌యార్డు ఉద్యోగులు నలుగురు ఉన్నారని, వీరి కుటుంబాల్లో అర్హులైన ఒక్కొక్కరికి సంస్థలోనే శాశ్వత ఉద్యోగాలు ఇస్తామన్నారు. క్రేన్‌ ట్రయల్‌ రన్‌ వేసి అప్పగించే బాధ్యతను చేపట్టిన మూడు ప్రైవేటు కంపెనీలకు చెందిన కార్మికుల్లో ఆరుగురు ఆ ప్రమాదంలో చనిపోయారని, వీరి కుటుంబాల్లో ఒక్కొక్కరికి హిందుస్థాన్‌ షిప్‌యార్డులోనే కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

షిప్‌యార్డు సీఎండీ ఎల్‌వీ శరత్‌బాబు మాట్లాడుతూ... మృతిచెందిన కార్మిక కుటుంబాల సంక్షేమం దృష్ట్యా రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నామన్నారు. తమ సంస్థకు చెందిన ఉద్యోగులు, కార్మికులకు కంపెనీ పరంగా చెల్లించే పరిహారానికి ఇది అదనమని చెప్పారు. సంస్థ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం సూచించిన పరిహారాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. బాధితులకు సంస్థ పరంగా రావాల్సిన లాంఛనాలు అందిస్తామన్నారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

క్రేన్‌ ప్రమాదంపై మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రేన్‌ బిగించే కాంట్రాక్టు దక్కించుకున్న ముంబైకి చెందిన అనుపమ్‌ కంపెనీ, ట్రయల్‌ రన్‌ వేసి అప్పగించే బాధ్యతను చేపట్టిన విశాఖకు చెందిన గ్రీన్‌ ఫీల్డ్‌ కార్పొరేషన్‌, లీడ్‌ ఇంజనీర్స్‌ కంపెనీలపై 304(ఏ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి అనేక మందిని విచారించాల్సి ఉందని కేసు దర్యాప్తు చేస్తున్న హార్బర్‌ ఏసీపీ టేకు మోహన్‌రావు చెప్పారు.



సంబంధిత వార్తలు